Horoscope Today In Telugu 23 June 2021: నేటి రాశి ఫలాలు.. ఓ రాశివారికి వాహనయోగం
Horoscope Today In Telugu 23 June 2021: బయటకు వెళ్లేముందు అన్ని విషయాలు, వస్తువులు పరిశీలించుకుని వెళ్లడం ఉత్తమం. మానసిక ప్రశాంతత కోసం నేడు కొంత సమయం ధ్యానం చేయాలి. తీరిక లేకుండా పనులు చేస్తున్న వారైతే పని నుంచి నేడు విరామం తీసుకోవడంతో ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కొన్ని విషయాలలో విభేదాలు తలెత్తుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగవు.
Horoscope Today In Telugu 23 June 2021: మేష రాశి
మీరు విందు, విలాసాలకు దూరంగా ఉండాలి. లేకపోతే ఖర్చులు మరింత భారమై ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. ఇంట్లో ఆహారం తినడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగవుతుంది. లాభదాయకమైన పనులు మిమ్మల్ని వరిస్తాయి. సన్నిహితుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడి నెలకొంటుంది. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.
వృషభ రాశి
నేడు వీరికి ఎలాంటి కోరికలు ఉండవు. ఇతరులపై అసూయ, దౌర్జన్యం అనే విషయాలకు చాలా దూరంగా ఉంటారు. మిమ్మల్ని సంప్రదించే వ్యక్తులకు ఎలాగైనా సహాయం చేయాలని భావిస్తారు. కొత్త వ్యక్తులను కలుసుకోవడం అంత శ్రేయస్కరం కాదు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పనిచేసే చోట ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలున్నాయి.
Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్
మిథున రాశి
ఇంటికి సంబంధించి పరిశుభ్రత లేదా కొత్త నిర్మాణం లాంటి విషయాలపై యోచిస్తారు. మీకు ఎవరితోనైనా ఇబ్బంది తలెత్తితే చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. మీ అభిప్రాయం నిర్భయంగా చెప్పి ముందడుగు వేస్తారు. కొన్ని విషయాలలో నిరీక్షణ తప్పదు. ఎట్టకేలకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
కర్కాటక రాశి
ఈ రోజు కేవలం మీ వ్యక్తిగత పనులు, ప్రదర్శనపై దృష్టిసారిస్తారు. పెట్టుబడులు చేయడానికి కొందరు వ్యక్తులు అనుకోకుండా మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది. మీ మాటతీరుతో ప్రయోజనాలు పొందుతారు. ప్రయాణాలకు దూరంగా ఉంటేనే క్షేమదాయకం. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అప్రమత్తత లేకపోతే నష్టాలు సంభవిస్తాయి.
సింహ రాశి
బయటకు వెళ్లేముందు అన్ని విషయాలు, వస్తువులు పరిశీలించుకుని వెళ్లడం ఉత్తమం. మానసిక ప్రశాంతత కోసం నేడు కొంత సమయం ధ్యానం చేయాలి. తీరిక లేకుండా పనులు చేస్తున్న వారైతే పని నుంచి నేడు విరామం తీసుకోవడంతో ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కొన్ని విషయాలలో విభేదాలు తలెత్తుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగవు.
కన్య రాశి
తరువాత తరగతికి వెళ్లడానికి మీకు అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతానికి ప్రగల్భాలు పలకడానికి కొన్ని విజయాలు ఉన్నాయి. కానీ ఇది భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ప్రయాణాలు చేయాలని నిర్ణయం తీసుకుంటారు. కొందరు ప్రమాదకర వ్యక్తులు మీకు తారసపడతారు. ఉద్యోగులు తమ పనిలో నిమగ్నమవుతారు.
Also Read: Vinayak Chaturthi 2021: వినాయక చతుర్థి ఇవాళ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా ?
తులా రాశి
కొన్ని ఆయుధాల ద్వారా మీకు హాని కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు మీరు అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలి. సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకోకూడదు. మీ ప్రయాణాలు ప్రస్తుతానికి సరైనవో కావో పునరాలోచించుకోవాలి. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. ఉద్యోగులకు పనిభారం అధికం కానుంది.
వృశ్చిక రాశి
ఊహలను వదిలేసి వాస్తవాలను గ్రహించడం మొదలుపెట్టడం నేర్చుకుంటారు. ఊహించిన అన్ని విషయాలు నిజం కావని, ఇతరులకు హాని చేస్తాయని గ్రహిస్తారు. నూతన పరిచయాలతో మీలో చాలా మార్పు వస్తుంది. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. ఆర్థిక ఇబ్బందలు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతనతో ప్రయోజనం చేకూరుతుంది.
ధనుస్సు రాశి
కొందరు వ్యక్తులతో అవసరం లేకున్నా తిరగడం మానేయాలి. మీ ప్రతిభకు పదునుపెట్టే సమయం ఆసన్నమైంది. జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడతారు. మీకు ఏమి జరుగుతుందో వాటిని ఎంత ప్రయత్నించినా నియంత్రించలేరు. ఇంట్లో కొన్ని విషయాలు చికాకు తెప్పిస్తాయి. ఉద్యోగులు మరింతగా శ్రమించి పనులు పూర్తిచేస్తారు.
మకర రాశి
కొన్ని అనుకోని సంఘటనలతో మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. నేడు కొన్ని విషయాలలో సున్నితంగా వ్యవహరించాలి. చేసే పని నుంచి కొంతకాలం విరామం తీసుకోవడం లాభదాయకం. విద్యార్థులు తమ కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. అనుకోని పరిస్థితులలో మీ చేతికి ధనం వస్తుంది. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే
కుంభ రాశి
ముందుగా ప్లాన్ చేసిన కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. నేడు ఎలాంటి అద్భుతాలను మీరు ఆశించవద్దు. మంచివారితో సన్నిహిత సంబంధాలు మెరుగు చేసుకోవాలని భావిస్తారు. ముఖ్యమైన పనులను కొంతకాలం వాయిదా వేస్తారు. కొన్ని అంచనాలు తప్పుతాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు.
మీన రాశి
మీరు కచ్చితమైన నిర్ణయాలు తీసుకుని ముందుకుసాగుతారు. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. కొన్ని విషయాలలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. కెరీర్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. పనులు త్వరగా పూర్తవలేదని కాస్త నిరాశ చెందుతారు. కానీ పట్టుదలతో మరోసారి ప్రయత్నిస్తే రెట్టింపు ఫలితాలు మీ సొంతం. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook