Horoscope Today July 14th: నేటి రాశి ఫలాలు.. ఈ 4 రాశుల వారికి చంద్ర అనుగ్రహం కలుగుతుంది..
Horoscope Today July 14th 2022: ఇవాళ గురువారం. హిందువులు శ్రీమహా విష్ణువును కొలిచే రోజు. కొందరు సాయి బాబాను కూడా కొలుస్తారు. నేటి రాశి ఫలాల్లో ఆ దైవం ఆశీస్సులు ఎవరిపై ఉన్నాయి.. ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Horoscope Today July 14th 2022: ఇవాళ గురువారం. హిందువులు శ్రీమహా విష్ణువును కొలిచే రోజు. కొందరు సాయి బాబాను కూడా కొలుస్తారు. నేటి రాశి ఫలాల్లో ఆ దైవం ఆశీస్సులు ఎవరిపై ఉన్నాయి.. ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మేష రాశి (Aries)
ఇవాళ బృహస్పతి అనుగ్రహం మీపై ఉంటుంది. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. కీలక విషయాల్లో ఆత్మవిశ్వాసంతో నిర్ణయం తీసుకుంటారు. వచ్చిన అవకాశాలను మరో ఆలోచన లేకుండా సద్వినియోగం చేసుకుంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ప్రేమికులు సంతోషంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు స్నేహితుల సాయంతో మంచి జాబ్ పొందుతారు.
వృషభ రాశి (Taurus)
ఇవాళంతా నిరాశజనకంగా గడుస్తుంది. ఈరోజును ఆస్వాదించలేరు. అహంకారపూరితంగా వ్యవహరించడం మీకు చేటు చేస్తుంది తప్ప లాభం ఉండదు. మీ వృత్తిపరమైన జీవితంతో పాటు కుటుంబ జీవితాన్ని అది అతలాకుతలం చేస్తుంది. ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. అంతర్గతంగా అది మీకు తెలుస్తూనే ఉంటుంది. మీలోని సృజనాత్మకతను అది అడ్డుకుంటుంది.
మిథున రాశి (GEMINI)
ఇవాళ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. పనిలో బాగా రాణిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం ఏదో ఒక రూపంలో అందుతుంది. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. తోబుట్టువులతో సంబంధాలు బలపడుతాయి. ప్రభావశీలురైన వ్యక్తులతో పరిచయాలు మీ బిజినెస్‌ను మరింత పరుగులు పెట్టించడంలో పనికొస్తాయి.
కర్కాటక రాశి (Cancer)
చంద్ర అనుగ్రహం మీకు కలిసొస్తుంది. అది మీకు సంతోషం కలిగేలా చేస్తుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు బాగా ఉపయోగపడుతాయి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించండి. వ్యాపారపరంగా సంక్లిష్ట నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సన్నిహితులు మీకు అండగా నిలుస్తారు.
సింహ రాశి (LEO)
చంద్ర అనుగ్రహంతో సానుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనిని హుషారుగా ముందుకు తీసుకెళ్తారు. భార్య లేదా భర్తతో రొమాంటిక్‌గా గడుపుతారు. వైవాహిక బంధం మరింత బలపడుతుంది.కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి శుభవార్త అందుతుంది. ప్రేమికులు అనవసర విషయాలపై వాదనలకు దిగవద్దు.
కన్య రాశి (Virgo)
ఇవాళ మీరు నిరాశకు గురవుతారు. మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. లేనిపక్షంలో అది మీకు మరిన్ని కష్టాలు తీసుకొస్తుంది. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. లేనిపక్షంలో మీ ప్రేమ బంధంపై ఎఫెక్ట్ పడుతుంది. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
తులా రాశి (Libra)
ఇవాళ మనశ్శాంతిగా గడుపుతారు. వ్యాపారపరంగా మరిన్ని పెట్టుబడులు పెట్టే యోచనలో ఉంటారు. అది మీ వ్యాపారంలో లిక్విడిటీని పెంచుతుంది. మీ సంపాదన మీ సేవింగ్స్‌ను పెంచుతుంది. భార్య లేదా భర్తతో ఎక్కువ సమయం గడుపుతారు. అవివాహితులకు మంచి పెళ్లి సంబంధం రావొచ్చు.
వృశ్చిక రాశి (Scorpio)
చంద్రుడి సానుకూల ప్రభావం మీపై ఉంటుంది. గతంలో మీకు ఎదురైన నష్టాలు ఇప్పుడు లాభాలుగా మారుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఆఫీసులో పని రీత్యా ప్రశంసలు దక్కుతాయి. మీ బాస్ మీ పట్ల మంచి అభిప్రాయంతో ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బదిలీ జరగవచ్చు. అవివాహితులు లేదా ప్రేమికులు పెళ్లి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.
ధనుస్సు రాశి (Sagittarius)
పరిస్థితులన్నీ అదుపులో ఉంటాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా మీ నెట్‌వర్క్ మీకు కలిసొస్తుంది. మీ ఇల్లు లేదా ఆఫీసు కోసం కొన్ని కళాకృతులు కొనుగోలు చేసి తీసుకొస్తారు. కుటుంబంతో కలిసి సినిమాలు లేదా ఇతరత్రా వినోద కార్యక్రమాలకు వెళ్తారు.
మకర రాశి (Capricorn)
ఆర్థిక పురోగతి ఉంటుంది. సంపాదనకు ఖర్చులకు మధ్య బ్యాలెన్స్ ఏర్పడుతుంది. మీ ఉద్యోగంలో మీరు బాగా రాణిస్తారు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. మీ నుంచి డబ్బు అప్పుగా తీసుకున్నవారు తిరిగి చెల్లిస్తారు. మీ ప్రత్యర్థులు లేదా శత్రువులు అదుపులో ఉంటారు.ఆరోగ్యం బాగుంటుంది.
కుంభ రాశి (Aquarius)
మీ ఇంటికి మరమత్తులు చేసే ఆలోచనలో ఉంటారు. ఇంటిని అందంగా అలంకరించాలని భావిస్తారు. ఇంటి గురించి మీ శ్రద్ధ మీ భార్య లేదా భర్తకు మీ పట్ల మరింత సదాభిప్రాయాన్ని ఏర్పరుస్తుంది. స్నేహితులు, సహోద్యోగులతో వివాదాలు సద్దుమణుగుతాయి. వివాదాలకు సంబంధించి మీకు శుభవార్త ఉండొచ్చు.
మీన రాశి (Pisces)
చంద్రుడి అనుగ్రహం మీపై ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. పాత ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. చాలాకాలంగా మీకు రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. ఆర్థికపరంగా అది మీరు నష్టాల నుంచి బయటపడేలా చేస్తుంది. ఇల్లు లేదా లగ్జరీ వస్తువుల కొనుగోలుకు లోన్ కోసం అప్లై చేసే అవకాశం ఉంది.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)
Also Read: Godavari Floods: రేపు గోదావరి నదికి మూడవ ప్రమాద హెచ్చరిక, లంక గ్రామాలకు సంబంధాలు కట్
Also Read: Vijay Devarakonda: కరణ్ జోహార్ తో దేవరకొండకు అఫైర్ అంటూ క్రిటిక్ దారుణ వ్యాఖ్యలు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.