Horoscope Today June 28th 2022: మంగళవారం మొత్తం 12 రాశుల వారికి ప్రత్యేకమైన రోజు. గ్రహాల గమనం రాశిచక్రంలోని 12 రాశులను ప్రభావితం చేస్తుంది. మంగళవారం రోజు ఏ రాశుల వారికి లాభం, ఏయే వ్యక్తుల జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి (Aries)


ఈ రాశి వారు ఆఫీసులో చిన్న చిన్న విషయాలకు వివాదాలు పెట్టుకోకూడదు. అహంకారం పనికిరాదు. ఈ రోజు వ్యాపారానికి మంచి రోజు, వ్యాపారవేత్తల గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి యువత డబ్బును వృధా చేస్తే భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది. కుటుంబంలో ఎవరికైనా పుట్టినరోజు ఉంటే, దానిని పూర్తి ఉత్సాహంతో జరుపుకోండి. బహుమతులు ఇచ్చి సంతోషపెట్టండి.ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఏదైనా మతపరమైన కార్యక్రమం ఉంటే, అందులో చురుకుగా పాల్గొనండి.


వృషభ రాశి (Taurus)



ఉద్యోగం చేసే వృషభ రాశి వారు ఈరోజు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ నిరుత్సాహపడకండి. ఆర్థికపరంగా వ్యాపారులకు ఇవాళ మంచి రోజు. పెట్టుబడుల ద్వారా లాభాలను పొందవచ్చు. యువత కొన్ని పనుల్లో సవాళ్లను ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో మానసిక ఒత్తిడికి గురికావాల్సి రావొచ్చు. అంతమాత్రాన కుంగిపోవద్దు. హార్ట్ పేషెంట్లు ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి, కొలెస్ట్రాల్ పెంచే ఆహారాన్ని తినకూడదు. ఎవరికైనా సాయం చేయాల్సిన సందర్భం వస్తే వెనుకాడవద్దు.


మిథున రాశి (GEMINI)


ఈ రాశి వారికి మనస్సు కలత చెందుతుంది, ముఖ్యమైన పనులపై ఏకాగ్రత దెబ్బతింటుంది. ఆదాయానికి మించి ఖర్చు పెట్టే అవకాశం ఉంది. సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండాలి, వ్యాపారస్తులు డబ్బు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువత ప్రతికూల భావజాలాన్ని వదిలివేయాలి, అది మీ పురోగతికి ఆటంకం అవుతుంది. ప్రతి ఒక్కరినీ ప్రేమగా చూసుకోండి. అలర్జీలు వచ్చే అవకాశం ఉంది, స్వీయ-ఔషధాలను పక్కనపెట్టండి. మంచి వైద్యుడిని సంప్రదించండి. స్నేహితులు, కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు ఉంటుంది.


కర్కాటక రాశి (Cancer) 


కర్కాటక రాశి వ్యక్తులు పని పట్ల ఉత్సాహంగా ఉండాలి. మీరు వ్యాపారవేత్త అయితే వినయపూర్వకమైన స్వభావం మీ గుర్తింపునిస్తుంది. అది మీ వ్యాపారానికి మేలు చేస్తుంది. యువకులు తమ వాక్చాతుర్యం ద్వారా ఎదుటివారిని ఆకట్టుకుంటారు. కుటుంబం నుంచి శుభవార్తలు అందుకుంటారు. అలర్జీ, శ్వాస సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ప్రస్తుతం ఆర్థిక కష్టాల్లో ఉంటారు. గతంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడమే ఇప్పటి పరిస్థితులకు కారణం.


సింహ రాశి (LEO)


ఈ రాశి వారికి ఆఫీసులో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇవాళంతా మంచే జరుగుతుంది. రిటైల్ వ్యాపారులు వ్యాపారాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. పిల్లలు మనస్సు వికాసం చెందే గేమ్స్ ఆడాలి. పిల్లవాడు ఏ ఆట ఆడుతున్నాడో చూడటం తల్లిదండ్రుల బాధ్యత. మామతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది, అయితే వివాదాలు పక్కనపెట్టి ప్రేమపూర్వకంగా మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని గుర్తుంచుకోండి. పొట్ట సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లయితే, ఇప్పుడు మీకు ఉపశమనం లభిస్తుంది. సరైన ఆహారం తీసుకోవాలి.


కన్య రాశి (Virgo)


ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడుతున్న కన్యా రాశి వారికి పరిస్థితులు మెరుగవుతాయి. వ్యాపారుల ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు వస్తుంది, కష్టపడి పని చేస్తారు. ఇతరుల చేదు మాటలు యువత హృదయాన్ని గాయపరుస్తాయి, అలాంటి వారిని గుర్తించి వారికి దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యుల వివాదాన్ని పరిష్కరించడంలో మీరు మధ్యవర్తిత్వం వహించవలసి ఉంటుంది. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు టోపీ, అద్దాలు ధరించడానికి ప్రయత్నించండి. మీరు గౌరవం పొందాలనుకుంటే, ఇతరులతో మంచిగా ప్రవర్తించండి.


తులా రాశి (Libra)



తుల రాశి వారు ఆఫీసు పనుల నిమిత్తం ప్రయాణం చేయవలసి ఉంటుంది, సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. హోటల్ రెస్టారెంట్‌లో రంగంలో ఉన్న వ్యాపారులు పరిశుభ్రత, నాణ్యతపై శ్రద్ధ చూపితే రోజువారీ ఆదాయం పెరుగుతుంది. యువత విషయంలో ఇప్పుడు మానసిక ఆందోళనలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంతో కలిసి భజన కీర్తన చేయడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ రోజు మంగళవారం, ఇంట్లో అందరూ కలిసి హనుమాన్ చాలీసా పఠించవచ్చు. అజీర్తి ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.


వృశ్చిక రాశి (Scorpio)


వృశ్చిక రాశి వారికి సైనిక విభాగంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విభాగంలో ఉన్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారస్తులకు ఫార్మా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. సీనియర్ల మాటలను గౌరవించాలి. కుటుంబంలో సామరస్యాన్ని కొనసాగించాలనుకుంటే, మీ జీవిత భాగస్వామి మాటలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఈరోజు ఆహారంలో ఘనపదార్థాలకు బదులుగా ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి, అది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు సామాజిక కార్యకలాపాలపై ఆసక్తిని కలిగి ఉంటారు.


ధనుస్సు రాశి (Sagittarius)  


ఈ రాశికి చెందిన వారు ఈరోజు తమ సహోద్యోగులతో సహకరిస్తూ ప్రవర్తించాలి. అలా చేస్తే వారికి మేలు జరుగుతుంది. ఈరోజు చిల్లర వ్యాపారులు ఆశించిన లాభం పొందడంలో వెనుకబడి ఉండవచ్చు, కానీ దాని గురించి నిరుత్సాహపడకండి. కొన్నిసార్లు అలాంటి పరిస్థితి తలెత్తుతుంది. విద్యార్థులు ఇక నుంచి కోర్స్, స్టడీస్ కి సంబంధించిన నోట్స్ చేసుకోండి, ఇది భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్త్రీలను గౌరవించండి. ఆరోగ్యం విష‌యంలో ఏదైనా ఆప‌రేష‌న్ చేయించుకోవాల్సి వస్తే స‌ర్జ‌న్ చెప్పిన రూల్స్ క‌చ్చితంగా పాటించ‌డం మంచిది. 


మకర రాశి (Capricorn) 



మకర రాశి వ్యక్తులుకు పనిభారం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారులు లాభం వైపు దృష్టి పెట్టాలి, హార్డ్‌వేర్ వ్యాపారులు ఈ రోజు లాభం పొందుతారు. యువత తమ లక్ష్యంపై దృష్టి పెట్టాలి, అప్పుడే విజయం సాధించబడుతుంది. కుటుంబంలో బంధుత్వాలు చెదిరిపోతే వాటిని సరిదిద్దుకోవడం శ్రేయస్కరం, అనవసర వివాదాలు పెట్టుకోకూడదు, పరిష్కారం అవసరం. ఆరోగ్యం పట్ల అప్రమత్తత అవసరం. పాత స్నేహితులను కలుస్తారు. బంధువులతో కలిసి కుటుంబ ఫంక్షన్లలో పాల్గొంటారు.


కుంభ రాశి (Aquarius)


ఆఫీసు నియమాలను పాటించాలి, ఆఫీసులో చిన్న చిన్న విషయాల్లో గొడవలు మంచిది కాదు. వ్యాపారంలో ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయి, వాటిని ఓపికతో పూర్తి చేయాలి. మాటల్లో సౌమ్యతను కాపాడుకోండి. లేనిపక్షంలో అది యువత పనిని కూడా ప్రభావితం చేస్తుంది. కుటుంబంలో చిన్నచిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది, వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం విషయంలో, దీర్ఘకాలిక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థుల్లో మేధో సామర్థ్యం పెంపొందుతుంది.


మీన రాశి (Pisces) 


మీన రాశి వ్యక్తులు టీమ్‌ను లీడ్ చేసే అవకాశం పొందుతారు. ఒకేసారి అనేక పనులు చేయగలుగుతారు. వ్యాపారులు ఈరోజు ఆర్థికంగా నష్టపోవాల్సి రావచ్చు, అది వారికి ఇబ్బంది కలిగిస్తుంది, కానీ నిరుత్సాహపడకండి. ఈరోజు యువత తమకు బాగా సన్నిహితులైన స్నేహితులు, బంధువులతో సమయం గడపడానికి ప్రయత్నిస్తే, అది మంచిది. తలనొప్పి విషయంలో అప్రమత్తంగా ఉండండి. తలకు మసాజ్ చేయడం ద్వారా, కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. స్నేహితులతో వివాదాలు మంచిది కాదు.


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)



Also Read: Maharashtra Political Crisis: రెండుసార్లు రాజీనామాకు సిద్ధపడి వెనక్కి తగ్గిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. ఆయన వల్లే..


Also Read: Rajiv Swagruha flats Allotment: రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపులు.. స్‌బుక్‌లో లైవ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.