Horoscope Today June 2nd 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి జీవిత భాగస్వామి లేదా లవ్‌మేట్‌తో విభేదాలు...
Horoscope Today June 2nd 2022: నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి పూర్తి సానుకూల ఫలితాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి.
Horoscope Today June 2nd 2022: నేటి రాశి ఫలాల ప్రకారం... ఇవాళ కొన్ని రాశుల వారికి తమ జీవిత భాగస్వామి లేదా లవ్‌మేట్‌తో విభేదాలు తప్పకపోవచ్చు. కాబట్టి కాస్త ఓపిక, సంయమనం అవసరం. దుందుడుకుగా వ్యవహరిస్తే కుటుంబ జీవితంలో చికాకులు తలెత్తుతాయి. ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..
మేషరాశి ( Aries)
ఈరోజు ప్రారంభంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఓపికగా వ్యవహరించాల్సి ఉంటుంది. భవిష్యత్తు గురించి ఎక్కువగా చింతించకండి. ఆఫీసులో అదనపు బాధ్యతలతో పని భారం పెరుగుతుంది.కష్టపడితే వ్యాపారంలో లాభాలు ఉంటాయి. డబ్బు దుబారా చేయడం మానుకోండి. ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి చూపుతారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని రహస్య విషయాలను పంచుకునే అవకాశం ఉంటుంది.
వృషభ రాశి (Taurus)
ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. మీ ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించి ఒక కొత్త ప్రణాళికను రూపొందించుకుంటారు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారంలో ఆశించిన లాభం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లడానికి ప్లాన్ చేసే అవకాశం.
మిథున రాశి (GEMINI)
మానసికంగా కొంత కలవరపడవచ్చు. అన్ని పనుల్లో జాగ్రత్తగా ఉండండి. ఆహారంలో నిగ్రహాన్ని పాటించండి. లేనిపక్షంలో ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో మార్పు జరగవచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈరోజు అనుకూలమైన రోజు. కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఉంటుంది. లవ్‌మేట్‌తో ఏదో విషయంలో వివాదం రావచ్చు.
కర్కాటక రాశి (Cancer)
ఉదయాన్నే శుభవార్తలతో మీ రోజు ప్రారంభమవుతుంది. కుటుంబంలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఈరోజు ప్రారంభించే పనులన్నింటిలో విజయం చేకూరుతుంది. వ్యాపారంలో అనుకున్నదానికంటే ఎక్కువ లాభం ఉంటుంది. ఈ రాశికి చెందిన అవివాహితులకు వివాహ సంబంధం రావచ్చు. లవ్‌మేట్ నుంచి ఖరీదైన బహుమతులు పొందుతారు.
సింహ రాశి (LEO)
కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. ఆఫీసులో అధికారుల సహకారం ఉంటుంది. విద్యా విషయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించే ముందు నిపుణులను సంప్రదించండి. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ప్రేమికులు పెళ్లి విషయం చర్చించుకోవచ్చు.
కన్య రాశి (Virgo)
ఈరోజు మీకు చాలా అనుకూలమైన రోజు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. దాంతో మీ మనసు ఆనందంగా ఉంటుంది. ఆర్థిక స్థితి బలపడటంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారస్తులకు పాత అప్పులు వసూలవుతాయి. విద్యార్థులు చదువుల పట్ల అజాగ్రత్తగా వ్యవహరిస్తే నష్టపోతారు. జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
తులా రాశి (Libra)
ఏ పని పూర్తయినా మనసు ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీరు స్నేహితులతో ఎక్కువ సమయం గడపవచ్చు. ఆకస్మిక ధన లాభం కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పోటీకి సిద్ధమవుతున్న విద్యార్థులు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన రోజు. పెద్దల ఆశీస్సులు తీసుకుంటే మరిన్ని సానుకూల ఫలితాలు ఉంటాయి.
వృశ్చిక రాశి (Scorpio)
ఈరోజు మీకు సాధారణ రోజుగా గడుస్తుంది. కొన్ని శుభవార్తల వల్ల కుటుంబంలో ఉత్సాహ వాతావరణం నెలకొంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. విద్యా సంబంధమైన పనుల కోసం ప్రయాణం చేయవచ్చు. లవ్‌మేట్‌తో విభేదాలు రావచ్చు
ధనుస్సు రాశి (Sagittarius)
ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. తండ్రి సహకారంతో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. స్నేహితుల సహకారంతో వ్యాపారంలో లాభం ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. మీ పాత స్నేహితుడు ఒకరిని కలిసే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అనవసర విషయాలకు జోలికి వెళ్లకపోవడం మంచిది.
మకర రాశి (Capricorn)
ఇది మీకు కొంత ఆశ్చర్యం కలిగించే రోజు. కుటుంబంలో ఉత్సాహకర, సంతోషకర వాతావరణం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఇది మంచి రోజు. ప్రేమలో ఉన్నవారు లవ్‌మేట్‌తో సినిమాలు చూడటానికి వెళ్లే అవకాశం ఉంటుంది.
కుంభ రాశి (Aquarius)
ఈరోజు మీ ముఖ్యమైన పనులు కొన్ని పూర్తి కాగలవు. ఆకస్మిక ధనలాభం సాధ్యమవుతుంది. ఆఫీసులో అధికారులతో వాగ్వివాదం జరగవచ్చు. వ్యాపారంలో లాభం పొందడానికి, కస్టమర్ల పట్ల సున్నితంగా వ్యవహరించండి. కొత్త పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రాశికి చెందిన అవివాహితులకు వివాహ సంబంధం రావచ్చు.
మీన రాశి (Pisces)
ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. అనుకోని శుభవార్త ఒకటి కుటుంబంలో ఉత్సాహకర వాతావరణాన్ని నింపుతుంది. వ్యాపారస్తులు డబ్బు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకోండి, లేనిపక్షంలో వివాదాలు రావొచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తకుండా చూసుకోండి.
Also Read: EPFO Jobs 2022: ఈపీఎఫ్ఓలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు
Also Read: ఈ ఆరుగురు హీరోయిన్స్‌కి తీవ్ర అనారోగ్య సమస్యలు.. నొప్పిని పంటి బిగువున భరిస్తూనే నటిస్తున్నారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook