Horoscope Today September 9th 2022: ఇవాళ శుక్రవారం. హిందూ శాస్త్రాల ప్రకారం శ్రీమహాలక్ష్మికి అంకితం చేయబడిన రోజు. శుక్రవారం రోజు వివాహిత స్త్రీలు ఉదయాన్నే స్నానమాచరించి, దేవుడికి దీపం వెలిగించి ఉపవాసం ఉంటారు. లక్ష్మీ దేవి మంత్రాన్ని పఠిస్తూ పూజ చేస్తారు. శుక్రవారం లక్ష్మీ దేవి ఆరాధన ఇంటికి శుభాలను తీసుకొస్తుంది. మరి ఈ శుక్రవారం ఆ లక్ష్మీ దేవి అనుగ్రహం ఏయే రాశుల పట్ల ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries) : 


వృత్తి వ్యవహారాల్లో తీరిక దొరకదు. ఫ్యామిలీతో గడిపేందుకు కూడా సమయం చిక్కదు. ఇది మిమ్మల్ని మానసిక అలసటకు గురిచేస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మిశ్రమ ఫలితాలు ఉండొచ్చు. ఉద్యోగస్తులకు కొంత సానుకూల సమయం. జాబ్ ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితి సాధారణమే.


వృషభ రాశి (Taurus)


విధి మీకు అనుకూలంగా ఉంటుంది. పరిస్థితులన్నీ అదుపులోనే ఉంటాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే సమయం. మీ కృషి, కష్టం వృథాగా పోదు. గతంలో వాయిదా వేసిన పనులను తిరిగి పట్టాలెక్కిస్తారు. దైవ దర్శనం కోసం ఫ్యామిలీతో కలిసి ప్రయాణాలు చేస్తారు. కష్టాల్లో ఉన్నవారు సాయం కోరితే తోచిన మేర సాయం అందిస్తారు.


మిథున రాశి (GEMINI)


మీ జాతకంలో ఇవాళ చంద్రుడి స్థానం ప్రతికూల పరిస్థితులను కలగజేస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. బిజినెస్‌లో నష్టాలు రావొచ్చు. ప్రస్తుతానికి పెట్టుబడుల జోలికి వెళ్లకపోవడం మంచిది. గతంలో వచ్చిన లాభాలు కూడా ఇప్పుడు నష్టాలుగా మిగిలిపోతాయి. వివాదాల్లో తలదూర్చవద్దు. లేనిపక్షంలో పరిస్థితి మరింత దిగజారుతుంది.


కర్కాటక రాశి (Cancer) 


చంద్ర అనుగ్రహం లభిస్తుంది. వృత్తి రీత్యా శుభవార్త అందుకునే ఛాన్స్ ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. అనవసర విషయాలపై ఎవరితోనూ లేనిపోని వాగ్వాదాలకు దిగవద్దు. అత్యుత్సాహం కూడా పనికిరాదు. మీ సహనాన్ని పరీక్షించే సందర్భాలు ఎదురవుతాయి. విద్యార్థులు తమ చదువుపై ఎక్కువగా దృష్టి సారించాలి. 


సింహ రాశి (LEO)


ప్రేమలో ఉన్న వ్యక్తులు మధురానుభూతులు పొందుతారు. అవివాహితులైనవారికి మంచి పెళ్లి సంబంధం రావొచ్చు. వృత్తి రీత్యా బాగా రాణిస్తారు. ఉద్యోగంలో మీ కొలిగ్స్ సహాయ సహకారాలు లభిస్తాయి. రత్నాలు, బంగారంపై పెట్టుబడి లాభదాయకంగా ఉండొచ్చు. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది.


కన్య రాశి (Virgo)


ఇవాళ మీరు చాలా సంతోషంగా గడుపుతారు. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. మేదోపరమైన అంశాల అధ్యయనానికి ఆసక్తి చూపుతారు. ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులు అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. పోటీపరీక్షలు రాసిన విద్యార్థులు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. కుటుంబంలో స్త్రీల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.


తులా రాశి (Libra)


ఈరోజు ప్రారంభంలో కొంత నిరుత్సాహం, అసంతృప్తి వెంటాడుతాయి. సాయంత్రానికల్లా పరిస్థితులన్నీ మెరుగవుతాయి. మిమ్మల్ని ఆవహించిన నెగటివిటీ తొలగిపోతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. వృత్తి రీత్యా మునుపెన్నడూ వెళ్లని ప్రదేశాలకు ప్రయాణం ఉండొచ్చు. వ్యాపారస్తులకు అన్నివిధాలా అనుకూల సమయం. ఒప్పందాలకు సిద్ధమయ్యేవారు డాక్యుమెంట్స్‌ను క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది.


వృశ్చిక రాశి (Scorpio)


ఆరోగ్యం మెరుగవుతుంది. పనిలో మీ కొలిగ్స్‌ మీకు చాలా సపోర్టివ్‌గా ఉంటారు. చేపట్టిన పని సక్సెస్ అవుతుంది. డైరీ, ఆర్డ్ అండ్ కల్చర్ తదితర వ్యాపారాల్లో ఉన్నవారికి కలిసొస్తుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోగల శక్తి సామర్థ్యాలు సొంతం చేసుకుంటారు. ఎక్కడైనా రాణించగలననే ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.


ధనుస్సు రాశి (Sagittarius)  


ఫ్యామిలీ గెట్ టు గెదర్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఇంటికి సంబంధించి కొన్ని మరమత్తులు చేపట్టే అవకాశం ఉంది. బంధువుల నుంచి గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగ, వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వేతన జీవులకు వేతనం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు స్థిరంగా ఉంటాయి. తోబుట్టువులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.


మకర రాశి (Capricorn) 


చంద్ర అనుగ్రహంతో ఆరోగ్యపరంగా,ఆర్థికపరంగా మంచి స్థితిలో ఉంటారు. మీ ఏకాగ్రత చెక్కు చెదరదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కమిట్ అయిన పనికి కట్టుబడి ఉంటారు. సకాలంలో పని పూర్తి చేసేందుకు ఓవర్ టైమ్ పనిచేస్తారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది.


కుంభ రాశి (Aquarius)


పాత అనారోగ్య సమస్యలు మళ్లీ తిరగబెడుతాయి. అవి మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తాయి. ప్రస్తుతం ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. డ్రైవింగ్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. న్యాయపరమైన వ్యవహారాల్లో రాజీ కుదిరే అవకాశం ఉంటుంది. అది మీకు కొంత ఊరట కలిగిస్తుంది. అనవసర విషయాలపై చర్చలు, వాగ్వాదాలు చేయవద్దు.


మీన రాశి (Pisces) 


వృత్తి జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. కుటుంబ జీవితం సంతోషాన్నిస్తుంది. మీలోని స్కిల్స్ మరింత మెరుగుపరుచుకుంటారు. మీ ఖర్చులు, ఆదాయం బ్యాలెన్స్ అవుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. ఒకరి పట్ల ఒకరికి మరింత నమ్మకం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. 


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)


Also Read: Chandrababu:వేరుశనగ బస్తాల చోరీ.. ప్రేమ పేరుతో చేపలమ్ముకునే అమ్మాయికి మోసం! చంద్రబాబు ఫ్లాష్ బ్యాక్ ఇదేనట..!    


Also Read: Seat Belt Devices: అమెజాన్‌లో అమ్మే ఆ చిన్న పరికరాలకు.సైరస్ మిస్త్రీ మరణానికి సంబంధం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook