Horoscope Weekly: ఈ రాశుల వారు మాటల్లో జాగ్రత్త.. లేదంటే ఇబ్బందులు తప్పవు..!
Horoscope Weekly: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉండనుంది? ఏ రాశుల వారు సమస్యల్లో చిక్కుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలపై జ్యోతిష్య నిపుణులు చెబుతున్న ముందస్తు అంచనాలు ఇలా ఉన్నాయి.
Horoscope Weekly: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలికల ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. గ్రహాల కదలికలను బట్టి.. ఈ వారం (డిసెంబర్ 26 నుంచి జనవరి 3 వరకు) రాశి ఫలాలను తెలిపారు జ్యోతిష్య నిపుణులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మేష రాశి (Aries)
చికాకు కారణంగా సహనం లోపించే అవకాశముంది. స్వీయ నిగ్రహంతో ముందుకు సాగాల్సిన సమయమిది. స్నేహితులు సమయానికి సహాయ పడతారు. వ్యాపార విస్తరణ, లాభదాయకమైన అవకాశాలు ఉంటాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. ఆదాయం తగ్గటం సహా ఖర్చులు పెరుగే అవకాశముంది.
వృషభ రాశి (Taurus)
మీరు చేయాల్సిన పనులను ఉత్సాహం పూర్తి చేస్తారు. అయితే ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. మీ మనస్సును బాధ పెట్టే సంఘటన జరగొచ్చు. తండ్రి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు. కటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
మిథున రాశి (Gemini)
మీరు ఈ వారం భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశముంది. కోపం పెరిగే అవకాశముంది.. ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ బాధ్యత పెరుగుతుంది. తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. మొండి బకాయిలి తీరుతాయి. ఉద్యోగులకు అధికారుల సహకారం ఉంటుంది.
కర్కాటక రాశి (Cancer)
ఆత్మవిశ్వాసం తగ్గే ప్రమాదముంది.. ప్రశాంతంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టొచ్చు.. ఇందుకు స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. బట్టలపై ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఉద్యోగంల బాధ్యతలు పెరగొచ్చు.
సింహ రాశి (Leo)
నిరాశ, అసంతృప్తి, ఆత్మవిశ్వాసం లోపించడం వంటివి జరుగుతాయి. విద్యార్థులు చదువుపై ఆసక్తి కనబరుస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. అధికారులలతో అభిప్రాయ విభేదాలు రావచ్చు.
కన్యా రాశి (Virgo)
వ్యాపారులు తమ వ్యాపార విస్తరణకు చేసే పననులు ఫలితాలనిస్తాయి. తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. పనిలో శ్రమ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరగొచ్చు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగరిత్యా దూరపు ప్రయాణాలు చేయొచ్చు.
తుల రాశి (Libra)
ఈ రాశివారు ఈ వారమంతా.. ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. అయితే ఈ సమయంలో స్వీయ సంయమనం అవసరం. సోమరితనం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. ఉద్యోగులకు శ్రమ పెరిగే అవకాశముంది. తల్లి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలిగిన.. అందుకు అధికంగా శ్రమ పడాల్సి వస్తుంది.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రాశి వారు వారంతా మాటలు పొదుపుగా వాడాలి. అనవసర విషయాల గురించి మాట్లాడటం వల్ల ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. అవసరానికి డబ్బు చేతికందుతుంది. సంపద పెరుగుతుంది. ఉద్యోగులకు పై స్థాయి అధికారుల నుంచి ప్రోత్సాహం, సహకారం లభిస్తుంది. ట్రాన్స్ఫర్లకు అవకాశాలు ఉన్నాయి.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రాశివారు స్వీయ సంయమనంతో ఉండాల్సిన సమయమిది. ప్రసంగ ప్రభావం పెరుగుతుంది. స్తిరాస్థుల ద్వారా ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగంలో మార్పు జరగొచ్చు. అధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. భవిష్యత్ పురోగతికి అవకాశం ఉంటుంది.
మకర రాశి (Capricorn)
ఈ రాశివారు వారమంతా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యల కారణంగా.. వైద్య ఖర్చులు పెరగవచ్చు. ఉద్యోగులు ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి రావచ్చు. పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.. జీవన పరిస్థితులు అసౌకర్యంగా అనిపిస్తాయి.
కుంభ రాశి (Aquarius)
ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. నిరుత్సాహానికి గరైనప్పుడు కుటుంబ సభ్యుల అండగా నిలుస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దేవాలాయాలను సందర్శిస్తారు. తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు పాత స్నేహితుని సహాయంతో అవకాశాలు లభిస్తాయి. ఖర్చులు పెరగొచ్చు.
మీన రాశి (Pices)
ఈ వారమంతా ఆనందగా గడుస్తుంది. అయితే సంతోషంగా ఉన్నప్పుడు.. నిగ్రహం కోల్పోవద్దు. ఇంట్లో విభేదాలు రావచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు పై స్థాయి అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. కొనుగోళ్ల కారణంగా ఖర్చులు పెరగ్చొచు.
Also read: December 25 Horoscope: ఆ రాశి వారికి తిరుగులేదు.. ఈ శనివారం ఏ పనిలోనైనా విజయమే!
Also read: Blessings of jupiter : కొత్త ఏడాదిలో ఆ మూడు రాశులకు తిరుగులేదు.. బృహస్పతి అనుగ్రహంతో అంతా శుభమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook