How To Become Rich With Laxmi Puja In 30 Days: జీవితంలో ప్రతి వ్యక్తి బాగా సంపాదించాలని కోరుకుంటారు. అంతేకాకుండా ఇంట్లో ఎలాంటి వస్తువులకు లోటు లేకుండా ఉండాలని అకాంక్షిస్తారు. ముఖ్యంగా సమాజంలో గౌరవం పొందాలని కూడా కోరుకుంటారు. అయితే ఆ కోరికలు నెరవేరాలనుకుంటే తప్పకుండా లక్ష్మి దేవి అనుగ్రహం తప్పని సరిగా పొందాల్సి ఉంటుంది. లక్ష్మిదేవి అనుగ్రహం లభించడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. కొన్ని నియమాలు పాటించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ప్రతి రోజు 5 ప్రత్యేక పనులను చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డబ్బు పొందడానికి ఈ పద్ధతులను అనుసరించండి:
తులసి ముందు నెయ్యి దీపం వెలిగించండి:

లక్ష్మి దేవి అనుగ్రహం పొందడానికి తప్పకుండా ఇంట్లో తులసి మొక్కను నాటాల్సి ఉంటుంది. భారతీయులు తులసి మొక్కలో లక్ష్మి దేవి నివసిస్తూ ఉంటుందని నమ్ముతారు. అయితే డబ్బు పొందడానికి తప్పకుండా తులసి మొక్క ముందు నెయ్యితో దీపం వెలిగించి పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.


భోజనం చేసేటప్పుడు..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ఆహారం తినే క్రమంలో మీ ముఖాన్ని తూర్పు దిశలో ఉండేలా చూసుకోండి. తూర్పు దిశలో తిరిగి తీనడం వల్ల అన్నపూర్ణ దేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా లక్ష్మి దేవి కూడా ప్రసన్నమవుతుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


ఈశాన్యంలో గంగాజలం చల్లండి:
ఇంటి ఈశాన్య దిశలో ఎలాంటి పాత వస్తువులను ఉంచకూడదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. దుష్ట శక్తులు ఇంటి నుంచి దూరంగా ఉండడానికి క్రమం తప్పకుండా ఈశాన్యంలో గంగాజలాన్ని చల్లుకోవాలి. ఇలా చేస్తే డబ్బులు లభిస్తాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


నిద్రలేవగానే అరచేతిని చూడండి:
తక్కువ సమయంలో ధనవంతులు కావాలనుకుంటే.. ఉదయాన్నే ముందుగా మీ అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి. దీనితో పాటు 'కరాగ్రే వసతే లక్ష్మీ' అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల సరస్వతి, లక్ష్మిదేవిల అనుగ్రహం లభిస్తుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


 


Also Read: అప్పటి నుంచి ఏమీ లేదు.. ఎవర్ని ఎక్కడ పెట్టాలో ఎన్టీఆర్ కు తెలుసంటున్న డైరెక్టర్!


Also Read: Amazon Smart tv offers: మీ ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చే స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook