Shravana Purnima 2022 Remedies: శ్రావణ పూర్ణిమ రోజునే రాఖీపండుగను జరుపుకుంటారు. ఇది శ్రావణ మాసంలో చివరి రోజు. ఆ తర్వాత భాద్రపద మాసం ప్రారంభం కానుంది. ఆస్ట్రాలజీ ప్రకారం, పూర్ణిమ నాడు అనేక ప్రత్యేక యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజున లక్ష్మీదేవి (Goddess Lakshmi), శివుడిని పూజించడం వల్ల మీకు ఎప్పుడు డబ్బుకు లోటు ఉండదు. లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి కొన్ని చిట్కాలను జ్యోతిష్యశాస్త్రంలో చెప్పబడ్డాయి. అవేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిట్కాలు పాటించండి
>> పూర్ణిమ తిథి రోజున రావిచెట్టును పూజించడం మంచిది. ఎందుకంటే ఇందులో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి కొలువుంటారని నమ్ముతారు. అంతేకాకుండా ఈరోజున రావిచెట్టుకు నీరు పోసి.. చెట్టు కింద దీపం పెట్టండి.  
>> శ్రావణ పౌర్ణమి రోజున లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.
>> లక్ష్మీదేవి మరియు కుబేరుడి అనుగ్రహాన్ని పొందడానికి.... పౌర్ణమి రోజున శ్రీ యంత్రాన్ని పూజించండి. అలాగే, కుబేర్ యంత్రాన్ని కూడా ఆరాధించడం వల్ల మీకు డబ్బుకు లోటు ఉండదు.  
>> మీ ఇల్లు సుఖ సంతోషాలు, అష్టఐశ్వర్యాలతో తులతూగాలంటే ఇంటికి దక్షిణవర్తి శంఖాన్ని తీసుకురండి. శంఖంపై ఎర్రచందనంతో 'ఓం శ్రీ హ్రీం శ్రీ కమలే కమలయే ప్రసీద్ శ్రీ హ్రీం శ్రీ ఓం మహాలక్ష్మ్యై నమః' అనే మంత్రాన్ని రాయండి. ఆ తర్వాత ఈ శంఖాన్ని పూజగదిలో ఉంచండి.
>> శ్రావణ పూర్ణిమ రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజు లక్ష్మీ దేవి, శ్రీమహావిష్ణువుకు ఎరుపు-పసుపు రంగు రక్షారేఖను కట్టి.... రక్షించమని ప్రార్థించండి.


Also Read: Rakhi Festival 2022: రాఖీ పండుగ నుండి 5 రాశులవారికి గోల్డెన్ డేస్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook