Dream Interpretation: మనం నిద్రలో రోజూ కలలు కంటూ ఉంటాం. ఇందులో మంచివి, చెడు రెండూ ఉంటాయి. మనకు వచ్చే కలలను బట్టి ప్యూచర్ తెలుసుకోవచ్చని స్వప్నశాస్త్రంలో చెప్పబడింది. కలలో చేపలు కనపించడం శుభప్రదంగా భావిస్తారు. కలలో చేపలను చూడటం (Seeing fish in dream) అంటే మీరు త్వరలో కొన్ని శుభవార్తలను వింటారని అర్థం. కలలో ఎలాంటి చేపలను చూడటం వల్ల ఏయే బెనిఫిట్స్ కలుగుతాయో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కలలో గోల్డ్ ఫిష్ కనిపిస్తే...
మీకు కలలో గోల్డ్ ఫిష్ కనిపిస్తే, రాబోయే కాలంలో మీరు మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల నుండి చాలా ప్రేమను పొందబోతున్నారని అర్థం. సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. అదే సమయంలో, కలలో డాల్ఫిన్ చేపలను చూడటం రాబోయే రోజుల్లో మీకు ధనం రాబోతుందని అర్థం. అంతేకాకుండా ఇది కొత్త జాబ్ లేదా వ్యాపారంలో లాభం పొందడానికి సంకేతం. 


కలలో రంగుల చేపలు కనిపిస్తే.. 
మీ కలలో రంగురంగుల చేపలు కనిపిస్తే, రాబోయే రోజుల్లో మీరు పెద్ద విజయాన్ని అందుకోబోతున్నారని అర్థం. అంతేకాకుండా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయని సిగ్నల్. మీరు మీ కలలో చేపలు పట్టడం చూస్తే, మీరు త్వరలో కొత్తదాన్ని ప్రారంభించవచ్చని అర్థం. అదే విధంగా ఈ కల మీ పురోగతిని  సూచిస్తుంది. 


Also Read: Trigrahi Yoga: కన్యారాశిలో బుధాదిత్య యోగం, త్రిగ్రాహి యోగం... ఈ రాశులవారికి ప్రత్యేక ప్రయోజనం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook