Indian Railways: వైష్ణోదేవి యాత్రకు ఇటీవలి కాలంలో ఆదరణ పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మిక ప్రదేశం. ఈ నవరాత్రికి తప్పకుండా దర్శించుకునే అతి ముఖ్యమైన ప్రాంతం. వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాలనుకుంటే ఈసారి కాస్త సులభమే. ప్రత్యేక రైళ్లు ఉన్నాయిప్పుడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా నవరాత్రి సమయంలో వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాలంటే రైల్వే టికెట్లు దొరకడం కష్టమౌతుంటుంది. రైల్వేల్లో వెయిటింగ్ ఉంటుంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వేస్ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రతి ఏటా దేశం నలుమూలల్నించి వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించేందుకు వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. అందుకే రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రారంభించింది.


పండుగ సమయంలో రైల్వే టికెట్లు పొందడమంటే చాలా కష్టపడాల్సి వస్తుంటుంది. అందుకే రైల్వే స్పెషల్ రైళ్లు నడుపుతుంటుంది. చాలాముందుగా టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించి విఫలమౌతుంటారు. పండుగ సమయంలో రద్దీ అలా ఉంటుంది. ఈసారి రైల్వే ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని యూపీలో ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. యూపీ నుంచి జమ్ము కశ్మీర్ ఇతర ప్రాంతాలకు ఈ రైళ్లు నడవనున్నాయి.


నార్నర్న్ రైల్వేస్ వారణాసి నుంచి వైష్ణో మాతాదేవికి  ప్రత్యేక రైలు ప్రారంభించింది. ఈ రైలు మొత్తం ఆరు ట్రిప్పులు నడుస్తుంది. అంబాలా క్యాంట్, లూథియానా, జలంధర్ క్యాంట్, పఠాన్ కోట్ క్యాంట్, జమ్ము తావి, ఉథమ్ పూర్ స్టేషన్లలో ఆగుతుంది. ప్రతి రోజూ ఆదివారం రాత్రి 11.20 గంటలకు మాతా వైష్ణోదేవి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మరుసటిరోజు రాత్రి 11.55 గంటలకు వారణాసి చేరుకుంటుంది. 


అక్టోబర్ 22 నుంచి నవంబర్ 26 వరకూ ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది. ప్రతి మంగళవారం ఉదయం 6.20 గంటలకు వారణాసి నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 11.20 గంటలకు చేరుకుంటుంది. 


Also read: Astrology: ఈ రెండు గ్రహాల సంచారంతో ఈ 3 రాశుల వారితో జీవితాల్లో కీలక మార్పులు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook