Indira Ekadashi 2022: ప్రతి నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి. ఒకటి శుక్లపక్ష ఏకాదశి, రెండు కృష్ణపక్ష ఏకాదశి. ప్రస్తుతం ఆశ్వయుజ మాసం నడుస్తోంది. ఆశ్వినీ మాసంలో వచ్చే ఏకాదశినే ఇందిర ఏకాదశి (Indira Ekadashi 2022) అంటారు. పితృ పక్ష సమయంలో వచ్చే ఏకైక ఏకాదశి ఇదే. ఈ సమయంలో ఉపవాసంతోపాటు శ్రాద్ధం చేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. ఏ కారణం చేతనైనా పితృ పక్షంలో పూర్వీకులకు శ్రాద్ధం చేయలేని వ్యక్తులు తప్పనిసరిగా ఇందిరా ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందిరా ఏకాదశి వ్రతం ఎప్పుడు?
ఇందిరా ఏకాదశి ప్రతి సంవత్సరం అశ్వినీ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు. ఈసారి ఇది 21 సెప్టెంబర్ 2022న జరుపుకోనున్నారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును (Lord vishnu) పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, అశ్వినీ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తేదీ సెప్టెంబర్ 20, మంగళవారం రాత్రి 09:26 గంటలకు ప్రారంభమై..  మరుసటి రోజు సెప్టెంబర్ 21 బుధవారం రాత్రి 11:34 గంటలకు ముగుస్తుంది. సెప్టెంబరు 22న ఉదయం 6.09 నుండి 8.35 గంటల వరకు పారణ సమయం పాటిస్తారు. 


వ్రత ప్రాముఖ్యత
మీరు ఏ కారణం చేతనైనా పితృ పక్షంలో పూర్వీకులకు శ్రాద్ధం చేయలేకపోతే, ఇందిరా ఏకాదశికి ఉపవాసం ఉండండ. ఎందుకంటే ఇందిరా ఏకాదశి ఉపవాసం ఉంటే పూర్వీకులకు శ్రాద్ధం చేయడంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇలా చేయడం వల్ల పూర్వీకులు వారి జనన మరణ బంధాల నుండి విముక్తి పొందుతారు.


Also Read: Budhaditya Raj Yog: కన్యారాశిలో బుధాదిత్య యోగం.. ప్రకాశించనున్న ఈ 4 రాశుల అదృష్టం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook