Indira Ekadashi 2022 Date Puja Vidhanam: హిందువులు ప్రతి నెలా రెండు ఏకాదశులను జరుపుకుంటారు. ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. అయితే ప్రస్తుతం పితృ పక్ష సమయం నడుస్తోంది. పైగా అశ్వినీ మాసం. ఈ మాసంలో వచ్చే కృష్ణ పక్ష ఏకాదశిని ఇందిర ఏకాదశి (Indira Ekadashi 2022 )అంటారు. పితృ పక్షంలో ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పూర్వీకులు స్వర్గప్రాప్తి పొందుతారని నమ్ముతారు. అంతేకాకుండా వారికి మరణానంతరం మోక్షం లభిస్తుందట. ఇందిరా ఏకాదశి ఎప్పడు, శుభ సమయం, పారణ తదితర వివరాలు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ్రత తేదీ, పారణ సమయం
హిందూ క్యాలెండర్ ప్రకారం, అశ్వినీ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి సెప్టెంబర్ 20 మంగళవారం రాత్రి 09:26 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 21 బుధవారం రాత్రి 11:34 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం సెప్టెంబరు 21న ఇందిరా ఏకాదశి ఉపవాసం ఉంటుంది. ఇందిరా ఏకాదశి మరుసటి రోజు సెప్టెంబరు 22వ తేదీ ఉదయం 06:09 నుండి 08.35 గంటల మధ్య ఉపవాసం చేయడం మంచిది.


శుభ ముహూర్తం
పంచాంగం ప్రకారం, ఇందిరా ఏకాదశి ఉపవాస ఆరాధనకు సెప్టెంబరు 21 ఉదయం 06.09 నుండి 09.11 వరకు అనుకూల సమయం. ఈ సమయం శ్రీ హరిని ఆరాధించడానికి ఉత్తమమైనది. అంతేకాకుండా భక్తులు ఉదయం 10:43 నుండి మధ్యాహ్నాం 12: 14 మధ్య కూడా విష్ణువును పూజించవచ్చు. ఆ రోజు ఉదయం 09.13 గంటలకు శివయోగం కూడా ఏర్పడుతుంది.  


ఇందిరా ఏకాదశి ప్రాముఖ్యత
ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పూర్వీకులు యమలోకం నుండి విముక్తి పొందుతారు. శ్రాద్ధ పక్షం/పితృ పక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి పుణ్యాన్ని పూర్వీకులకు సమర్పిస్తే నరకానికి వెళ్లిన పూర్వీకులు స్వర్గప్రాప్తి పొందుతారని చెబుతారు.


Also Read: Surya Gochar 2022: కన్యారాశిలో సూర్య సంచారం... ఈ రాశులవారికి అఖండ ఐశ్వర్యం! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook