Vaishno Devi Tour Package: దసరా సెలవుల్లో వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే ఆలోచన ఉందా బెస్ట్ టూర్ ప్లాన్ ఇదే
Vaishno Devi Tour Package in Telugu: మరి కొద్దిరోజుల్లో దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. దేశమంతా స్కూళ్లు, కళాశాలలతో పాటు వివిధ కార్యాలయాలకు దసరా సెలవులు ఉంటాయి. మరి ఈ దసరా సెలవుల్లో నవరాత్రుల సమయంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాలనుకుంటున్నారా..మీ కోసం ఆ వివరాలు..
Vaishno Devi Tour Package in Telugu: దసరా నవరాత్రి సమయంలో వైష్ణోదేవి ఆలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ఐఆర్ సీటీ అతి తక్కువ ధరలో 6 రోజుల టూర్ ప్యాకేజ్ ప్రకటించింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా దసరా సెలవుల్లో వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించేందుకు ఇది బెస్ట్ టూరిస్ట్ ప్లాన్ కాగలదు.
ఇండియన్ రైల్వేస్ నుంచి IRCTC ప్రత్యేకమైన Vishno Devi Tour Package ప్రకటించింది. దసరా నవరాత్రుల్లో ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ఇది మంచి సమయం. మంచి టూరిస్ట్ ప్లాన్. దేశంలో నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలోని అతిపెద్ద శక్తి పీఠాల్లో వైష్ణోదేవి ఆలయం ఒకటి. లక్షలాది హిందూ భక్తులకు ఇది ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. జమ్ములోని త్రికూట పర్వతాల్లో రాశి రియాసి జిల్లాలో ఉంది ఈ ఆలయం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కాత్రా బేస్ క్యాంప్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి ఏటా వైష్ణోదేవి సందర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు దేశంలోని అన్ని ప్రాంతాల్నించి తరలి వస్తుంటారు. చాలా సార్లు వాతావరణం అనుకూలించకపోవడంతో ఆలయం వరకూ చేరుకోలేకపోతుంటారు.
ఇండియన్ రైల్వేస్‌కు చెందిన IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజ్ ప్రకటించింది. ఇది ఆరు రోజుల ప్లాన్. ఇందులో 6 పగలు, 5 రాత్రులు ఉంటాయి. వైష్ణోదేవి దర్శనంతో పాటు అందమైన హిల్ వ్యూ, అందమైన లోయలు చూడవచ్చు. ట్రాన్స్‌పోర్ట్, హోటల్ స్టే, భోజనం అన్నీ ఈ టూర్ ప్యాకేజ్‌లో భాగంగా ఉంటాయి. మొత్తం 5 రాత్రులు, 6 పగలు ఉంటాయి. ప్రతి బుధవారం ఈ యాత్ర మొదలవుతుంది. ధర్డ్ ఏసీ రైలు ప్రయాణం ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ సదుపాయం ఉంటుంది. గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి ఈ టూర్ ప్రారంభమౌతుంది. ప్రయాణీకులు మధ్యలో డాక్టర్ అంబేద్కర్ నగర్, ఇండోర్, ఉజ్జయిని, సెహోర్, భోపాల్, విదిష రైల్వే స్టేషన్లలో ఎక్కవచ్చు.
ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే మనిషికి 11,900 రూపాయలు అవుతుంది. డబుల్ ఆక్సుపెన్సీ అయితే మనిషికి 13,400 రూపాయలు ఉంటుంది. సింగిల్ ఆక్యుపెన్సీ అయితే మనిషికి 21,200 రూపాయలు ఉంటుంది. ఆసక్తి కలిగిన భక్తులు IRCTC వెబ్‌సైట్ www.irctc.co.in.ద్వారా వివరాలు తెలుసుకుని టికెట్ బుక్ చేసుకోవచ్చు.
Also read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ దీక్షల వెనుక పెద్ద వ్యూహమే ఉందా, తెరవెనుక ఏం జరుగుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.