Vastu Tips For Puja Room: వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు దిశను అనుసరించి ఇంటి వంటగది, పూజగదిని నిర్మించుకుంటారు. ఈరోజుల్లో పూజగదిని కూడా ప్రత్యేకంగా నిర్మాణం చేసుకుంటున్నారు. కొంతమంది అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి ప్రత్యేక గది నిర్మించకుండా చెక్కతో చేసినవి ఇంట్లో ఏర్పాటు చేసుకుంటారు. అయితే, ఎక్కువ శాతం ఇళ్లలో చెక్కతో తయారు చేసిన పూజగదులను పెట్టుకుంటున్నారు. మరి ఇవి ఇంటికి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయా? నెగిటివ్ ఎనర్జీ ఇస్తాయా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పంచభూతాలకు అనుకూలంగా మనం ఇంటి నిర్మాణం చేపడతాం. వాస్తు ప్రకారం ఇంట్లో పూజగది దిశతోపాటు దాని నిర్మాణానికి ఉపయోగించిన లోహం కూడా ముఖ్యమైంది. వాస్తు ప్రకారం ఇంట్లో పూజగది ఈశాన్య దిశలో పెట్టుకోవాలి. మనం ఆ దేవుడికి పూజలు చేస్తున్నప్పుడు తూర్పు దిశగా నిలబడి పూజలు చేసేలా ఏర్పాటు చేసుకోవాలి. అయితే, చెక్కతో తయారు చేయించిన పూజగది కూడా మంచిదే కానీ, దాన్ని తయారీకి వినియోగించిన చెక్క కూడా నెగిటివ్ ఎనర్జీ ప్రసరింపజేసేదిగా ఉండకూడదు. 


ఇదీ చదవండి: ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే.. ధనలక్ష్మీ మీ వెంట ఉన్నట్టే.. కష్టాలు పరార్..


పూజగది చెక్కతో తయారు చేసింది ఏర్పాటు చేసుకుంటే దాన్ని తయారీకి వినియోగించిన చెక్క మంచి చెట్టు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే చెట్టుతో తయారు చేసింది అయి ఉండాలి. ఇది ఇంటికి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అంతేకాదు, ఇలాంటి పూజగదిని బయట నుంచి తీసుకువచ్చి ఏర్పాటు చేసుకుంటే దాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఇంటి గోడకు వేలాడదీయకూడదు. ఇది ఇంటికి నెగిటివ్ ఎనర్జీని ప్రసరింపజేస్తుంది. అందుకే ప్రత్యేకంగా తయారు చేసిన చెక్క లేదా నమ్మకమైన తయారీదారుల నుంచి పూజగదిని కొనుగోలు చేయవచ్చు.


ఇదీ చదవండి: అయోధ్య బాల రాముడికి 7 కిలోల బంగారు రామాయణం బహుమతి..


ఇలా ఇంట్లో పెట్టుకునే పూజగది శుభం, అశుభం ఇస్తుంది. ఇది మనం వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకునే దిశ, తయారీకి ఉపయోగించిన లోహం కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి బదులుగా పాలరాయితో తయారు చేసిన పూజగదులు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటిని కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే చాలా ఆలయాల్లో కూడా పాలరాయితో తయారు చేసిన విగ్రహాలు, ఆలయగోడల నిర్మాణాలు సైతం మనం చూసే ఉంటాం. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter