Krishna Janmashtmi 2022: భారతదేశంలో జన్మాష్టమి పండుగ ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ పండుగ 18 ఆగస్టు 2022న జరుపుకోనున్నారు. రోహిణి నక్షత్రమందు భాద్రపద మాసం కృష్ణపక్షంలోని అష్టమి తిథి నాడు శ్రీకృష్ణభగవానుడు (Lord Krishna) జన్మించారు. ఈ రోజున కృష్ణాష్ణమి జరుపుకుంటారు. ఇవాళ చిన్నకృష్ణుడిని పూజిస్తారు. తెలుగు లోగిళ్లలో ఈ పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది. ఆ రోజు అందరూ ఇంటి ముందు ముగ్గులు పెట్టడం, చిన్ని పిల్లలను కృష్ణుడిలా అలకరించడం, ఉట్టి కొట్టే పోటీలు మెుదలైనవి ఉంటాయి. ఈ జన్మాష్టమి రోజున 5 వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తారు. ఆ వస్తువులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ 5 వస్తువులను కొనండి
>> శ్రీకృష్ణునికి ఇష్టమైనది వేణువు. కృష్ణ జన్మాష్టమి రోజున చెక్క లేదా వెండి వేణువు ఏదైనా కొని తీసుకురండి. దీంతో మీ ఇంట్లోని ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. 
>> శ్రీకృష్ణుడు ప్రీతికరమైన వస్తువులో మరొకటి నెమలి పించం. దీనిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తే జాతకంలో దోషాలు తొలగిపోతాయి. కాలసర్ప దోషం కూడా వదిలిపోతుంది. 
>> కృష్ణ జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడికి వెన్న తినిపించండి.  మీరు కోరిన కోరికలన్నీ తీరుతాయి. 
>> జన్మాష్టమి రోజున వైజయంతి మాల కొని ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 
>> శ్రీకృష్ణుడికి గోవులంటే చాలా ఇష్టం. జన్మాష్టమి నాడు ఆవు మరియు దూడల చిన్న విగ్రహాలను కొనుగోలు చేసి ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి. ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషించి.. మీపై వరాల జల్లు కురిపిస్తాడు. 


Also Read: Bhadrapada Masam 2022: భాద్రపద మాసంలో భారీగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? ఈ పని చేయండి చాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook