Janmashtami 2022: మీరు కాలసర్ప దోషం నుండి బయటపడాలన్నా, కోరికలు నెరవేరాలన్నా... జన్మాష్టమి రోజున ఇలా చేయండి
Janmashtami 2022: మరో మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా జన్మాష్టమి పండుగను జరుపుకోనున్నారు. ఈ రోజున శ్రీకృష్ణుడి మంత్రాలను పఠించడం ద్వారా మీ కోరికలు నెరవేరుతాయి.
Janmashtami 2022: శ్రీ కృష్ణ భగవానుడు (Lord Krishna) భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు జన్మించాడు. ఈరోజునే జన్మాష్టమి జరుపుకుంటారు. విష్ణువు అవతారాలలో శ్రీకృష్ణావతారం ఒకటి. ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 18వ తేదీన జరుపుకోనున్నారు. ఈ రోజున కొన్ని మంత్రాలు పఠించడం ద్వారా మీ లైఫ్ బాగుంటుంది.
ఈ మంత్రాలను జపించడం శుభప్రదం
>> మంత్రం: ఓం శ్రీం నమః: శ్రీ కృష్ణాయ పరిపూర్ణతమయా స్వాహా
మీ పని ఏదైనా పెండింగ్‌లో ఉంటే... జన్మాష్టమి నాడు ఈ మంత్రాన్ని జపించండి. శ్రీ కృష్ణుడిని పూజించే సమయంలో ఈ మంత్రాన్ని పఠించడం శుభప్రదంగా ఉంటుంది.
>> మంత్రం: దేవకీ సుత్ గోవింద్ వాసుదేవ్ జగతపతే, దేహిమే తనయం కృష్ణ త్వమహం శరణం గాత్: క్లీం గ్లాం క్లీం శ్యామలాంగాయ నమః
సంతాన సమస్యలు ఎదుర్కొంటే.. జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజిస్తూ భార్యాభర్తలు ఈ మంత్రాన్ని పఠించాలి. ఇది బిడ్డను కనాలనే మీ కోరికను నెరవేరుస్తుంది.
>> మంత్రం: ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ్ గోపీజన్వల్లభాయీ స్వాహా.
పెళ్లి జరగడంలో జాప్యం జరిగినా, ఆటంకాలు ఎదురైనా ఈ మంత్రాన్ని పఠించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.
>> మంత్రం: గోవల్లభాయ్ స్వాహా
ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఈ మంత్రం ఆర్థిక శ్రేయస్సుతో పాటు ఆనందం మరియు శాంతిని కలిగిస్తుంది. జన్మాష్టమి రోజున ఈ మంత్రాన్ని పఠిస్తే ఎంతో మేలు జరుగుతుంది.
కాలసర్ప దోషం నుండి విముక్తి
జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడికి నెమలి పించంను సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. గ్రంధాల ప్రకారం, జన్మాష్టమి రోజు రాత్రి దిండు కింద ఏడు నెమలి ఈకలను ఉంచడం వల్ల కాల సర్ప దోషం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఇంట్లో నెమలి పించంను ఉంచడం వల్ల సుఖసంతోషాలు ఉంటాయి.
Also Read: Sun Transit 2022: ఆగస్టు 17 నుంచి ఈ 4 రాశుల అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook