Janmashtami 2022:  భాద్రపద మాసం మెుదలైంది. ఈ మాసంలోనే కృష్ణాష్టమి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ పండుగ ఆగస్టు 18, సోమవారం నాడు జరుపుకోనున్నారు. ఈ రోజున చిన్నికృష్ణుడిని పూజిస్తారు. ఈ రోజు మీ రాశిని బట్టి దానం చేయడం వల్ల బంపర్ బెనిఫిట్స్ పొందుతారు. జన్మాష్టమి (Shri Krishna Janmashtami 2022) రోజున మొత్తం 12 రాశుల వారు ఎలాంటి వస్తువులను దానం చేయాలో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries) : జన్మాష్టమి రోజున మేష రాశి వారు గోధుమలను దానం చేయాలి. అలాగే శ్రీవిష్ణు సహస్రనామం పఠించండి.
వృషభం (Taurus): కృష్ణాష్ణమి రోజున వృషభ రాశి వారు పంచదార దానం చేయాలి.
మిథునం (Gemini) : జన్మాష్టమి రోజున మిథున రాశి వారు పేదలకు అన్నదానం చేయాలి.
కర్కాటకం (Cancer) : ఈ రాశి వారు జన్మాష్టమి రోజు అన్నం దానం చేస్తే జీవితంలో సుఖసంతోషాలు వస్తాయి.
సింహం (Leo) : జన్మాష్టమి రోజున సింహ రాశి వారు ఉదయం నుండి శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేసి ఆ తర్వాత బెల్లం దానం చేయాలి.
కన్య (Virgo): కృష్ణ జన్మాష్టమి రోజున కన్యా రాశి వారు పేదలకు ఆహార ధాన్యాలను దానం చేయాలి.
తుల (Libra): శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున తుల రాశి వారు పేదలకు బట్టలు దానం చేయండి. 


వృశ్చికం (Scorpio): జన్మాష్టమి రోజున వృశ్చిక రాశి వారు గోధుమలను అవసరమైన వారికి దానం చేయాలి.
ధనుస్సు (Sagittarius): జన్మాష్టమి రోజున ధనుస్సు రాశి వారు దేవాలయాలలో మతపరమైన పుస్తకాలను దానం చేయండి. అవసరమైన వారికి పుస్తకాలు దానం చేయండి. 
మకరం (Capricron): మకర రాశి వారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నువ్వులను దానం చేయాలి.
కుంభం (Auarius): కుంభ రాశి వారు శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున ఆహారం లేదా నువ్వులు దానం చేయాలి. గీతలోని ఐదవ మరియు ఎనిమిదవ అధ్యాయాలను అధ్యయనం చేయండి.
మీనం (Pisces): మీన రాశి వారు జన్మాష్టమి రోజున శ్రీకృష్ణునికి నెమలి పించంను, వేణువును సమర్పించాలి. దీనితో పాటు పిల్లలకు, పేదలకు అరటిపండ్లు దానం చేయండి.


Also Read: Janmashtami 2022: శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు, శుభముహూర్తం, పూజా వివరాలు మీ కోసం 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook