June 2023 Grah Gochar: జూన్‌లో ఊహించని పరిణామం.. ఈ 3 రాశులకు జాక్ పాట్ ఖాయం..
Planet transit in june 2023: జూన్ నెలలో సూర్యుడు, బుధుడు, కుజుడు మరియు శని తమ తమ రాశులను మార్చనున్నారు. ఈ గ్రహాల రాశి మార్పు మూడు రాశులవారికి మంచి ప్రయోజనాలు ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
June 2023 grah gochar: గ్రహాలు కాలానుగుణంగా రాశులను ఛేంజ్ చేస్తాయి. ప్రతి నెల కొన్ని రాశుల గమనంలో మార్పు వస్తుంది. అలాగే జూన్ నెలలో కూడా కొన్ని ఫ్లానెట్స్ తమ రాశులను మార్చుకోనున్నాయి. జూన్ 07న గ్రహాల యువరాజు బుధుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. మళ్లీ అదే గ్రహం జూన్ 24న వృషభరాశిని విడిచిపెట్టి మిథునరాశిలోకి ఎంటర్ కానుంది. ఇదే సమయంలో శని కూడా తన సొంత రాశి అయిన కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. ఈ మంత్ చివరిలో కుజుడు సింహరాశిలో సంచరించనున్నాడు. వీరే కాకుండా గ్రహాల రాజైన సూర్యుడు జూన్ 15న మిథునరాశి ప్రవేశం చేయనున్నాడు. జూన్ లో ఈ గ్రహాల రాశి మార్పు వల్ల ఏ రాశుల వారికి మేలు జరగనుందో తెలుసుకుందాం.
కన్య
వచ్చే నెలలో కన్యారాశి వారి అదృష్టం ప్రకాశించనుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. ఆగిపోయిన పనులు మెుదలవుతాయి. వ్యాపారం బాగా సాగుతుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది.
మేషరాశి
జూన్‌లో గ్రహాల సంచారం వల్ల మేష రాశి వారి ఊహించని ప్రయోజనం పొందనున్నారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. గ్రహాల రాశి మార్పు మీకు శుభఫలితాలను ఇస్తుంది.
మిధునరాశి
గ్రహాల రాశి మార్పు మిథునరాశి వారికి మేలు చేస్తుంది. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆఫీసులో మీకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీ వ్యాపారం విస్తరిస్తుంది. ఇతరులతో మీ సంబంధాలు బలపడతాయి. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది.
Also Read: Budh Gochar 2023: జూన్ లో బుధుడి సంచారంతో ఈ రాశులకు సమస్యలు.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి