Gajkesari Rajyog In Meena Rashi 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా అనేక శుభ మరియు అశుభ యోగాలను సృష్టిస్తాయి. మీనరాశిలో బృహస్పతి మరియు చంద్రుని కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం మార్చి 22న అంటే ఉగాది నాడు ఏర్పడుతుంది. అలాగే ఈ రోజు నుండే హిందూ నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ రాజయోగం యొక్క ప్రభావం అన్ని రాశుల వారిపై కనిపిస్తుంది. దీంతో మూడు రాశులవారు అపారమైన ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు రాశిచక్రం
గజకేసరి రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి రెండవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశంఉంది. మీ మాటలతో ఇతరులను ఆకర్షిస్తారు. అలాగే మీడియా, సినిమా, మార్కెటింగ్ రంగాలతో సంబంధం ఉన్నవారు మంచి ప్రయోజనాలు పొందుతారు. 
కర్కాటక రాశిచక్రం
గజకేసరి రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సమయం బాగుంటుంది. ఆగిపోయిన పని పూర్తవుతుంది. 
మీన రాశిచక్రం
మీన రాశి వారికి గజకేసరి రాజయోగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ లగ్న గృహంలో ఈ యోగం ఏర్పడబోతోంది. అందుకే ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. దీంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఆర్థికంగా మరియు వ్యాపార పరంగా ప్రయోజనాలు పొందుతారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. దాంపత్య బంధం బాగుంటుంది. 


Also Read: Budh Gochar 2023: మీనరాశిలోకి బుధుడు.. ఇవాల్టి నుండి ఈ రాశులకు కావాల్సినంత డబ్బు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook