Navpancham Yog: అరుదైన నవపంచం రాజయోగం.. ఈ 3 రాశుల దశ తిరగడం ఖాయం...
Navpancham Yog: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బృహస్పతి, చంద్రుడు నవపంచం రాజయోగాన్ని సృష్టిస్తున్నారు. ఈ యోగం ఆర్థికంగా కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Navpancham Yog Benefits: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా సంచరించడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను సృష్టిస్తాయి. ఈ యోగాల ప్రభావం మానవ జీవితం పెను ప్రభావాన్ని చూపుతుంది. ఫిబ్రవరి 3న దేవగురువు బృహస్పతి మరియు చంద్రుడు నవపంచం రాజయోగాన్ని సృష్టించారు. ఈ రెండు గ్రహాల మధ్య స్నేహ భావం ఉంది. ఈ నవపంచం యోగ ప్రభావం వల్ల మూడు రాశులవారు లాభాలతోపాటు పురోభివృద్ధిని పొందే అవకాశం ఉంది.
నవపంచం రాజయోగం ఈ రాశులకు శుభప్రదం
మేష రాశిచక్రం
మేష రాశి వారికి నవపంచం యోగం ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు పిల్లల వైపు నుండి శుభవార్తలను పొందే అవకాశం ఉంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీకు అదృష్టం కలిసి వస్తుంది.
మిథునం రాశిచక్రం
చంద్రుడు మరియు గురువు యొక్క నవపంచం యోగం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. వ్యాపారులు తమ బిజినెస్ ను విస్తరిస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగులు ఆఫీసులో అదనపు బాధ్యతలు పొందే అవకాశం ఉంది. మీరు కోరుకున్న చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. మీ సామాజిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కన్య రాశిచక్రం
కన్యా రాశి వారికి నవపంచం యోగం లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందవచ్చు. అలాగే స్టాక్ మార్కెట్ , బెట్టింగ్ , లాటరీ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసేవారు భారీగా లాభాలను గడిస్తారు. మీరు దాంపత్య సుఖాన్ని పొందుతారు. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.
Also Read: Guru Margi 2023: బృహస్పతి తిరోగమనం.. ఏప్రిల్ 21 వరకు ఈ రాశులకు డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook