Guru Chandal Yog 2023: గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను ఛేంజ్ చేస్తాయి. దీని కారణంగా శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. ఇప్పుడు అలాంటి అశుభయోగం గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ 23, ఆదివారం నాడు దేవగురువు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. అప్పటికే ఛాయా గ్రహమైన రాహువు మేషరాశిలో ఉంటాడు. ఈ రెండు రాశుల కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని అశుభకరమైన యోగంగా  భావిస్తారు. ఈయోగం ఏర్పడినప్పుడు మూడు రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


ఈ మూడు రాశులవారు జాగ్రత్త
మేష రాశిచక్రం
మేష రాశి వారికి గురు చండాల యోగం హాని చేస్తుంది.  మీ లైఫ్ పార్టనర్ తో విభేదాలు రావచ్చు. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఆఫీసులో మీ సహచరులతో సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది. ఆర్థికంగా మీ పరిస్థితి క్షీణిస్తుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకండి. 


మిథునం రాశిచక్రం
గురు చండాల యోగం మిథునరాశి వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే ఈ యోగం మీ రాశి నుండి ఆదాయ గృహంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో పెట్టుబడి పెట్టకండి, నష్టపోయే అవకాశం ఉంది. పాలిటిక్స్ లో ఉన్నవారికి ఈ సమయం అంతగా కలిసిరాదు. మీరు స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలలో పెట్టుబడి పెడితే నష్టాలను చవిచూస్తారు. మీ ఆదాయంలో తగ్గుదల ఉంటుంది. 


కర్కాటక రాశిచక్రం
గురు చండాల యోగం ఏర్పడటం వల్ల కర్కాటక రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో నష్టాలను చవిచూస్తారు. ఎందుకంటే మీ రాశి నుండి పదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. అందుకే ఈ సమయంలో మీ మాటలను అదుపులో ఉంచుకోండి. ఆఫీసులో సహచరులతో విభేదాలు తలెత్తుతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో ఫైనల్ అయిన డీల్ ఆగిపోవచ్చు.


Also Read: Budhaditya Rajyog: మరో 3 రోజుల్లో 'బుధాదిత్య రాజయోగం'.. ఈ రాశులకు ఊహించనంత ధనం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook