Jupiter and Venus conjunction in Aries 2024: జాగ్రఫీ ప్రకారం, గ్రహాలన్నింటిలోకెల్లా పెద్ద గ్రహం బృహస్పతి, ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు. పురాణాల ప్రకారం, బృహస్పతిని దేవగురువు అని, శుక్రుడిని రాక్షసుల గురువు అని పిలుస్తారు. అయితే ఈ రెండు గ్రహాలకు జ్యోతిష్యశాస్త్రంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రేమ, ఐశ్వర్యానికి శుక్ర గ్రహం కారకుడి అయితే.. అదృష్టం, పెళ్లి మరియు సంతానాన్ని ఇచ్చే గ్రహం బృహస్పతిని భావిస్తారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వచ్చే ఏడాది ప్రారంభంలో శుక్రుడు మేషరాశిలోకి వెళ్లబోతున్నాడు. ఇప్పటికే అదే రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. 2024లో మేషరాశిలో గురుడు, శుక్రుడు సంయోగం ఏర్పడబోతోంది. వీరిద్దరి కలయిక 12 ఏళ్ల తర్వాత సంభవించనుంది. ఈ రెండు గ్రహాల మైత్రి వల్ల కొత్త సంవత్సరంలో ఏయే రాశులు వారు బెనిఫిట్స్ పొందబోతున్నారో తెలుసుకుందాం. 


సింహం: శుక్ర, గురు గ్రహాల మైత్రి సింహ రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీకు లక్ కలిసి వస్తుంది. కొత్త సంవత్సరంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు చదువు లేదా వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సక్సెస్ అవుతారు. ఫ్రెషర్స్ కు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. 
మిథునం: గురు, శుక్రుల కలయిక మిథున రాశి వారికి కొత్త సంవత్సరంలో చాలా ప్రయోజనాలను ఇస్తుంది. వీరి ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వచ్చే ఏడాది మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం విస్తరిస్తుంది.  స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీల్లో ఇన్వెస్ట్ చేసేవారు లాభపడతారు. 
కర్కాటకం: మేషరాశిలో శుక్రుడు, బృహస్పతి సంయోగం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ పని లేదా ప్రాజెక్టు చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ కెరీర్ 2024లో అద్భుతంగా ఉండబోతోంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. 


Also read: Trigrahi Yogam 2024: న్యూ ఇయర్ లో మకరరాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ రాశులకు గోల్డెన్ డేస్ స్టార్ట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి