Jupiter Transit 2022 effect on Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, దేవగురు బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. ప్రస్తుతం గురుడు మీనరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. నవంబరు 24న బృహస్పతి మార్గి నుండి ప్రత్యక్ష సంచారంలోకి (Jupiter Transit 2022) రానున్నాడు. గురు మార్గి వల్ల ఈరాశుల అదృష్టం ప్రకాశించనుంది. దేవగురువు బృహస్పతి ప్రత్యక్ష కదలిక వల్ల ఏ రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం. ఆ లక్కీ  రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries): మీనరాశిలో బృహస్పతి ఉండటం వల్ల మేష రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఇప్పటి వరకు నిలిచిపోయిన ప్రమోషన్ మీకు లభిస్తుంది. కొత్త జాబ్ ఆఫర్ పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది.
వృషభం (Taurus): బృహస్పతి ప్రత్యక్ష సంచారం వల్ల వృషభ రాశి వారికి అపారమైన సంపదలు చేకూరుతాయి. మీ కెరీర్‌లో మీరు ఎదురుచూస్తున్న అవకాశం మీకు లభిస్తుంది. వివాహం కూడా జరగవచ్చు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం.
వృశ్చికం (Scorpio): దేవగురువు బృహస్పతి మార్గం వృశ్చిక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగ-వ్యాపారాలలో లాభం ఉంటుంది. పెళ్లికాని యువతీయువకులకు వివాహమయ్యే అవకాశం ఉంది. 


కన్య (Virgo): మీనరాశిలో బృహస్పతి సంచారం కన్యారాశి వారికి శుభప్రదం కానుంది. ఆర్థిక స్థితి బలపడుతుంది. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. 
మీనం (Pisces): మీనరాశికి బృహస్పతి అధిపతి. ఇదే రాశిలో గురుడు సంచరిస్తున్నాడు. బృహస్పతి యొక్క ప్రత్యక్ష కదలిక ఈరాశిపై అధికంగా ఉంటుంది. దీంతో మీ అదృష్టం తెరవబడుతుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. వివాహం కుదిరే అవకాశం ఉంది. 


Also Read: Mangal Gochar 2023: మార్గంలోకి మంగళ దేవుడు.. ఈ 3 రాశులవారికి మంచి రోజులు మెుదలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook