Guru Gochar in December 2023: ప్రతి నెలా కొన్ని గ్రహా రాశుల యెుక్క కదలిక మార్పులు వస్తుంటాయి. డిసెంబరులో కూడా కీలక గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. ప్రస్తుతం దేవగురు బృహస్పతి మేషరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. గురుడు డిసెంబరు 31న అదే రాశిలో నేరుగా నడవనున్నాడు. మేషరాశిలో బృహస్పతి సంచారం వల్ల ఏయే రాశులవారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీనం: ఈ రాశికి బృహస్పతి అధిపతి. డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు పెళ్లి కుదిరే అవకాశం ఉంది. మీరు అప్పుల బాధ నుండి బయటపడతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. 
సింహం: సింహ రాశి వారికి బృహస్పతి కదలిక కలిసి వస్తుంది. వీరి ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. జాబ్ చేసేవారికి ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. 
కర్కాటకం: బృహస్పతి ప్రత్యక్ష సంచారం కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు కెరీర్ లో మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీరు ఏదైనా ల్యాండ్ లేదా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారం మీకు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. 


Also Read: Shukra Gochar 2023: ఈ నెలలో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. ఇందులో మీ రాశి ఉందా?


కన్య: గురుడు నేరుగా నడవడం వల్ల మీ సంపాదన రెట్టింపు అవుతుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. 
ధనుస్సు: బృహస్పతి కదలికలో మార్పు ధనుస్సు రాశి వారి జీవితాల్లో వెలుగులు నింపనుంది. మీ కెరీర్‌లో ఎదుగుదల ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 


Also Read: December Horoscope: డిసెంబర్ నెల రాశి ఫలాలు..ఈ రాశులవారికి ఊహించని లాభాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి