Guru Gochar In Mesh 2022: ప్రతి గ్రహం నిర్ణీత సమయం తర్వాత ఒక రాశి నుండి మరొక రాశికి బదిలీ అవుతుంది. 12 ఏళ్ల తర్వాత దేవగురు బృహస్పతి మీనరాశిని విడిచిపెట్టి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు.  ఏప్రిల్ 22న గురుడు మేషరాశిలో (Jupiter transit in Pisces 2023) సంచరించబోతున్నాడు. ఆస్ట్రాలజీలో బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. గురు సంచారం వల్ల ఏ రాశులవారు కెరీర్ అద్భుతంగా ఉండబోతుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురు సంచారం ఈ రాశులకు లాభదాయకం


మేషరాశి (Aries): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల అధిపతి అయిన బృహస్పతి ఏప్రిల్ 22న మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా మీలో ధైర్యం, శక్తి పెరుగుతాయి. మీ లైఫ్ పార్టనర్ తో బంధం బలపడుతుంది. ఈ సమయంలో ఉద్యోగస్తులకు పదోన్నతి, పురోభివృద్ధి లభిస్తాయి. పెళ్లికాని వ్యక్తులకు వివాహం కుదురుతుంది. వ్యాపారులకు భారీగా లాభాలు ఉంటాయి. భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో మీకు భారీగా లాభాలు ఉంటాయి. 


కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి బృహస్పతి సంచారం శుభప్రదంగా ఉంటుంది. గురు గ్రహ సంచారం వల్ల మీరు ఆర్థికంగా లాభపడతారు. ఈ సమయంలో మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారస్తులు భారీగా లాభాలను గడిస్తారు. ఉద్యోగంలో మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. 


మీనరాశి (Pisces): ఈ రాశిలోనే గురు సంచారం జరుగుతుంది కాబట్టి మీనరాశివారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీ జాతకంలోని రెండో ఇంట్లో బృహస్పతి సంచారం జరగబోతుంది. మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. చిక్కుకున్న డబ్బు మీకు అందుతుంది. మీనరాశి వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. 


Also Read: Budh Gochar 2023: శని యెుక్క రాశిలోకి బుధదేవుడు.. ఇక ఈ రాశులకు తిరుగుండదు.. డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి