Guru Gochar 2023 effect: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రేపు అంటే జూలై 10న చంద్రుడు, దేవగురు బృహస్పతి మేషరాశిలో మీట్ అవ్వనున్నారు. ఈ రెండు గ్రహాల కలయిక కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను ఇస్తుంది. గురుడు, చంద్రుడు సంయోగ ప్రభావం మొత్తం 12 రాశులపైనా ఉంటుంది. వీరిద్దరి కలయిక వల్ల మూడు రాశులవారు లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి:
బృహస్పతి, చంద్రుడు కలయిక మేషరాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వనుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులు ఊహించని ధనలాభం పొందుతారు. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. 
ధనుస్సు రాశి:
గురుడు, చంద్రుడు మైత్రి ధనస్సు రాశికి స్పెషల్ బెనిఫిట్స్ ఇవ్వనుంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు మెుదలవుతాయి. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీరు లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారు. మీరు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. 


Also Read: Astrology: 20 ఏళ్ల తర్వాత సూర్యుని రాశిలో కుజుడు-శుక్రుడు సంయోగం.. ఈ రాశులవారు కోటీశ్వరులవ్వడం ఖాయం..


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి బృహస్పతి, చంద్రుడు సంయోగం మీకు కలిసి వస్తుంది. మీకు ప్రతి విషయంలో ఫ్యామిలీ సపోర్టు ఉంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీరు ఊహించని ధనలాభం పొందుతారు. మీకు వివిధ మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 


Also Read: Surya Gochar 2023: జూలై 17న కర్కాటక రాశిలోకి సూర్యుడు.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook