Jupiter transit 2023: కొత్త ఏడాదిలో గజలక్ష్మీ రాజయోగం.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..
Jupiter transit 2023: కొత్త సంవత్సరంలో బృహస్పతి గ్రహం గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం 3 రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.
Gajlaxmi Raj Yog 2023: జ్యోతిషశాస్త్రంలో బృహస్పతిని దేవతల గురువు అంటారు. ఎవరి జాతకంలో గురు గ్రహం శుభస్థానంలో ఉంటుందో వారు సమాజంలో కీర్తిని పొందుతారు. 2023లో బృహస్పతి మీనరాశిని విడిచి మేషరాశిలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా గజలక్ష్మీ రాజయోగం (Gajlaxmi Raj Yog 2023) ఏర్పడుతుంది. ఈ యోగం యొక్క ప్రభావం అన్ని రాశుల వారిపై కనిపిస్తుంది. అయితే ఈ 3 రాశులవారు ఆర్థికంగా లాభపడనున్నారు. అంతేకాకుండా కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేషం (Aries): గజలక్ష్మీ రాజయోగం వల్ల మేషరాశివారికి ఆర్థికంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి లగ్నాధిపతి ఇంటికి వెళ్లబోతున్నాడు. దీంతో నిరుద్యోగులు జాబ్ ఆఫర్ ను పొందే అవకాశం ఉంది. మీరు పిల్లల వైపు నుండి శుభవార్తలు వింటారు. కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు బాగుంటుంది.
ధనుస్సు రాశి (Sagittarius): గజలక్ష్మీ రాజయోగం వల్ల ధనుస్సు రాశివారు ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి ఐదవ ఇంటిలో సంచరించబోతున్నాడు. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారికి నెరవేరుతుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. మీరు భవిష్యత్తులో మంచి లాభాలను పొందుతారు.
మిథునం (Gemini): గజలక్ష్మీ రాజయోగం ఏర్పడటంతో మీ ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది. ఈ సమయంలో మీరు పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. మరోవైపు, స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో లాభం ఉండవచ్చు. బిజినెస్ లో కొత్త డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. బ్యాంకింగ్, మీడియా లేదా విద్యా రంగంతో సంబంధం ఉన్నవారు లాభపడతారు. మెుత్తానికి ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది.
Also Read: Venus Transit 2023: మాలవ్య రాజ్యయోగం.. కొత్త సంవత్సరంలో ఈ 3 రాశుల వారు పట్టుకున్న ప్రతీది బంగారమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.