Jupiter Planet: త్వరలో యవ్వన దశలోకి బృహస్పతి... ఈ 4 రాశులకు డబ్బుతోపాటు కీర్తి ప్రతిష్టలు..
Guru Planet: ఆస్ట్రాలజీ ప్రకారం, ఫిబ్రవరి 1న బృహస్పతి గ్రహం యవ్వన దశలోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల 4 రాశుల వారు సమాజంలో గౌరవంతోపాటు అపారమైన సంపదను పొందుతారు.
Guru Planet: ప్రతి గ్రహానికి యవ్వనం, వృద్ధాప్య దశలు ఉంటాయి. ఫిబ్రవరి 1, 2023న దేవగురు బృహస్పతి యవ్వనంలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా అరుదైన హంస మహాపురుష యోగం (Hamsa Mahapurusha Yoga) ఏర్పడుతుంది. దీని కారణంగా నాలుగు రాశులవారు అపారమైన సంపదను పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
కన్య రాశిచక్రం (Virgo): దేవగురువు బృహస్పతి సంచారం కన్యారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి మీ సంచార జాతకంలో ఏడవ ఇంట్లో రాజయోగం ఏర్పడుతుంది. గురు సంచారం వల్ల మీరు ఆకస్మిక ధనలాభాలను పొందుతారు. పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. లైఫ్ పార్టనర్ తో సంబంధాలు మెరుగుపడతాయి.
మీన రాశిచక్రం (Pisces): బృహస్పతి మీ లగ్న గృహంలో హంస రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. పెళ్లికానీ వారికి వివాహం కుదురుతుంది. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. మీ లవ్ సక్సెస్ అవుతుంది. రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవారు పదవిని పొందే అవకాశం ఉంది.
ధనుస్సు రాశిచక్రం (Sagittarius): యవ్వనంలోకి బృహస్పతి ప్రవేశం ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి నాల్గో ఇంట్లో కూర్చున్నాడు. దీని వల్ల హంస రాజయోగం ఏర్పడుతోంది. ఈ సమయంలో మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. రాజకీయాల్లో మీరు విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తి లభిస్తుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది.
జెమిని రాశిచక్రం (Gemini): గురుడి యెుక్క యవ్వన దశ మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఈసమయంలో మీ సంపద రెట్టింపు అవుతుంది. ఆకస్మిక ధనాన్ని పొందుతారు. కోరుకున్న చోటికి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
Also Read: Budh Gochar 2023: అరుదైన యోగం చేస్తున్న బుధుడు... ఈ 3 రాశులకు లాభాలే లాభాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.