Jupiter retrograde 2022: దేవతల గురువు బృహస్పతి. ఇతడు జ్ఞానం, విద్య, సంపద, దాతృత్వం, వృద్ధి మెుదలైన వాటికి కారకుడు. ఆస్ట్రాలజీలో గురు గ్రహం రాశి మార్పు మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావం చూపుతుంది. జూలై 29 నుంచి బృహస్పతి మీనరాశిలో (Jupiter retrograde in Pisces 2022)తిరోగమనంలో ఉన్నాడు. ఈ గురు వక్రి కొన్ని రాశులవారికి అదృష్టం తేనుంది. ముఖ్యంగా ఇది 5 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునం (Gemini): బృహస్పతి తిరోగమనం ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగలకు ప్రమోషన్ వస్తుంది. ఈ సమయంలో మీరు ఏ పని మెుదలుపెట్టినా ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది. 


కర్కాటకం (Cancer): గురు వక్రి ఈ రాశివారికి మేలు చేస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు లాభపడతారు. జాబ్ చేసేవారికి ప్రమోషన్స్ వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. 


వృశ్చికం (Scorpio): ఈ రాశివారు ఆర్థికంగా మెరుగుపడతారు. వ్యాపారస్తులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో అప్పడప్పుడూ చిన్నపాటి గొడవలు రావచ్చు.


మకరం (Capricorn): ఈ రాశివారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా మెరుగుపడతారు. విదేశాల్లో వ్యాపారం చేసే వ్యక్తులు భారీగా లాభపడతారు. ఈ రాశివారికి డబ్బుకు లోటు ఉండదు. 


మీనం (Pisces): గురుడి తిరోగమనం ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగుల జీవితాల్లో మార్పులు సంభవించవచ్చు. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. విభేదాలు వచ్చే అవకాశం ఉంది.


Also Read: Santana Saptami Vratam 2022: సంతాన సప్తమి వ్రతం ఎప్పుడు, శుభ సమయం, ప్రాముఖ్యత  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook