Jupiter Retrograde 2023: గ్రహాల్లో దేవగురుగా భావించే గురు గ్రహం మేష రాశిలో తిరోగమనం చెందనుంది. గురుడి తిరోగమనం వల్ల కొన్ని రాశులకు అదృష్టం పట్టనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. సెప్టెంబర్ 4 నుంచి గురుడి తిరోగమనం కారణంగా ఆ 3 రాశులకు మహర్దశ పడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమతం ప్రకారం కుండలిలో గురుడు ఏ స్థితిలో ఉన్నాడో తప్పకుండా తెలుసుకుంటుంటారు. ఎందుకంటే గురుడు శుభ స్థితిలో ఉంటే ఆ జాతకులు జ్ఞానం, ధర్మాది కార్యక్రమాలు, సుఖ వైభోగాలు పొందుతాడని అంటారు. అంతేకాకుండా ఈ జాతకులకు జీవితమంతా అదృష్టం తోడుగా ఉంటుంది. సుఖ సంపదలు, ఆనందమైన దాంపత్య జీవితం లభిస్తాయి. సెప్టెంబర్ 4వ తేదీన గురు గ్రహం తిరోగమనం ప్రభావంతో మూడు రాశులకు మహర్దశ పట్టనుంది. ఎంతలా అంటే ఈ రాశులవారి కోర్కెలు నెరవేరుతాయి. సుఖ సంతోషాలు, ధన సంతోషాలు ప్రాప్తిస్తాయి. 


సింహ రాశి జాతకులకు గురుడి తిరోగమనం ప్రభావంతో అధృష్టం తోడుగా ఉంటుంది. కుటుంబంలో ఆధ్యాత్మిక, శుభ ప్రదమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఉద్యోగులపై గురు గ్రహం దయ ఉంటుంది. పదవి ప్రతిష్ట, డబ్బులు అన్నీ లభిస్తాయి. సంతానం విషయంలో కూడా గుడ్‌న్యూస్ ఉంటుంది. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు.


గురుడి తిరోగమనం ప్రభావంతో తులా రాశి జాతకులకు అత్యంత శుభప్రదం కానుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉండటంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం మీదే అవుతుంది. ఆన్నింటికంటే ముఖ్యంగా ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు అనువైన సమయం


గురుడి తిరోగమనం ప్రభావం మేష రాశి జాతకులపై తిరుగులేకుండా ఉంటుంది. ఊహించని విధంగా ధనలాభం కలగవచ్చు. అదృష్టం తోడవడంతో వరుస విజయాలు సాధిస్తారు. ఎంతలా ఉంటే ఎంత క్లిష్టమైన పని కూడా అవలీలగా పూర్తి చేస్తుంటారు. కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. ఉద్యోగులకు పదోన్నతి, జీతం పెరుగుతుంది. పెద్దఎత్తున డబ్బులు లభిస్తాయి. 


Aslo read: Lunar Eclipse 2023: చివరి చంద్ర గ్రహణం సమయం, తేదీ ఎప్పుడు, సూతక కాలం ఉంటుందా



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook