Jupiter Retrograde Effect: జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి గ్రహానికి విశేష ప్రాధాన్యత ఉంది. గ్రహాలన్నింటిలో గురు గ్రహం ప్రత్యేకత వేరు. శుభసూచకమైన గ్రహంగా భావిస్తారు. గురువు మీనరాశి ప్రవేశం..ఆ మూడు రాశులకు లెక్కలేని ప్రయోజనాలు చేకూర్చనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యం ప్రకారం గురు గ్రహం జూలై 29 నుంచి మీనరాశిలో ప్రవేశించి..13 నెలల వరకూ ఉండనున్నాడు. గురుడి మీనరాశిలో4 నెలల వరకూ వక్రావస్థలోనే ఉంటాడు. ఫలితంగా మిగిలిన 12 రాశులపై శుభ, అశుభ ప్రభావానికి దారి తీయనుంది. గురువు వక్రమార్గం కారణంగా మీనరాశిలో దుర్లభమైన యోగ గురు పుష్య యోగం ఏర్పడనుంది. అందువల్ల..ఆ మాడు రాశులపై గణనీయమైన సానుకూల ప్రభావం పడనుంది. 


గురువు వక్రమార్గంతో కర్కాటకం, మీనం, మకర రాశులకు అదృష్టం తన్నుకొస్తుంది. మూసుకుపోయిన మార్గాలన్నీ తెర్చుకుంటాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. దాంతోపాటు వ్యాపారంలో కూడా అంతులేని ధనలాభం కలుగుతుంది. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి.


మకర రాశి


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువు వక్రావస్థ కారణంగా మకరరాశివారికి మంచి రోజులు ప్రారంభమైనట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో గురువు ఈ రాశిపై పూర్తిగా అనుకూలంగా ఉంటాడు. ఉద్యోగం కోసం అణ్వేషించేవారికి లేదా ఉద్యోగస్థులకు అద్భుత అవకాశాలు లభిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. వ్యాపారులకు పూర్తిగా అనువైన సమయమిది. పనిచేసే చోట ప్రశంసలు లభిస్తాయి. మొత్తానికి లక్ష్మీదేవి కటాక్షం వర్ధిల్లుతుంది. 


కర్కాటక రాశి


గురుడి వక్రావస్థ కర్కాటక రాశివారికి అత్యధిక ప్రయోజనాలు చేకూర్చనుంది. ఈ సమయంలో ఉద్యోగాల్లో వృద్ధి కన్పిస్తుంది. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడి..ఆనందంగా గడుపుతారు. అటు ధన సంబంధిత సమస్యలు దూరమౌతాయి. వ్యాపారంలో అధిక లాభాలు ఆర్జిస్తారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తుంటే ఇంతకంటే అనువైన సమయం ఉండదు. ఈ రాశివారికి ప్రతి పనిలో విజయం లభిస్తుంది. 


మీనరాశి


మీనరాశి జాతకులకు అత్యంత అనువైన సమయం. ఈ సమయంలో మీనరాశివారి ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీ చిరకాల కోర్కెలు నెరవేరుతాయి. నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. ఆదాయం పెరిగి..కష్టాలు తీరుతాయి. బిగ్ డీల్స్ చేతికి అందుతాయి.


Also read: Budha Sancharam 2022: రాశిని మార్చబోతున్న బుధుడు.. ఆగస్టు 1 నుండి మారబోతున్న ఈ రాశుల ఫేట్!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook