Vakri Guru 2023: గురు తిరోగమనం వల్ల ఈ 3 రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగనుంది.. మీరున్నారా?
Jupiter Retrograde 2023: దేవగురు బృహస్పతి సెప్టెంబరు నెలలో తిరోగమనం చేయబోతున్నాడు. గురు వక్రీ ప్రభావం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Guru Vakri 2023 Effect: ప్రతి నెల కొన్ని గ్రహాలు ఉదయించడం, అస్తమించడం, సంచరించడం లేదా తిరోగమించడం చేస్తాయి. దీని వల్ల మెుత్తం 12 రాశులవారి జీవితాలు ప్రభావితమవుతాయి. దేవగురు బృహస్పతి మేషరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. ఇతడిని శ్రేయస్సు, వైభవం, సంపద, ఆధ్యాత్మికత మరియు ఆరాధనకు కారకుడిగా భావిస్తారు. గురుడు సెప్టెంబర్ 4, 2023 ఉదయం 9.15 గంటలకు తిరోగమనం చేయబోతున్నాడు. దీని వ్యతిరేక కదలిక ప్రభావం ప్రజలందరిపై జీవితాలపై శుభ మరియు అశుభ ప్రభావాలను చూపిస్తాయి. గురుడు రివర్స్ కదలిక ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
సెప్టెంబరులో ఈ రాశిచక్రం యొక్క పదవ ఇంట్లో బృహస్పతి తిరోగమనం చేయబోతున్నాడు. ఇది మీ వృత్తి మరియు వ్యాపారంపై మంచి ప్రభావాన్ని చూపనుంది. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు మంచి పొజిషన్ లభిస్తుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు.
మిధునరాశి
బృహస్పతి తిరోగమనం వల్ల మిథునరాశి వారికి మంచి రోజులు ప్రారంభంకానున్నాయి. మీ ఆదాయ గృహంలో గురుడు తిరోగమన చేయబోతున్నాడు. పైగా అతను ఏడవ మరియు పదో ఇంటికి అధిపతి. మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. మీరు మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. మీ లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు మార్కెట్, బెట్టింగ్ మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టే వారికి ప్రయోజనం ఉంటుంది.
Also Read: Astrology: ఈ 3 రాశుల వారు పుట్టుకతోనే అదృష్టవంతులు.. వీరికి దేనికీ లోటు ఉండదు..
మేషరాశి
తిరోగమన బృహస్పతి కూడా మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. బృహస్పతి మీ రాశిలోని లగ్న గృహంలో సంచరించబోతున్నాడు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగాలు కోసం ఎదురుచూసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది.
Also read: Venus Reverse Movement: తిరోగమనంలోకి వెళ్లబోతున్న శుక్రుడు.. ఈ 4 రాశులవారికి అదృష్టం, ఐశ్వర్యం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook