Vakri Guru in Meena Rashi 2023:  జ్యోతిషశాస్త్రంలో దేవగురు బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. ఇతడిని ఆనందం మరియు అదృష్టానికి కారకుడిగా భావిస్తారు. జాతకంలో గురుడు శుభస్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి తన స్వరాశి అయిన మీనరాశిలో ఉన్నాడు. అదే రాశిలో సెప్టెంబరు 4 నుంచి గురుడు తిరోగమన దిశలో కదలనున్నాడు. మీనంలో బృహస్పతి తిరోగమన కదలిక అన్ని రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల ముఖ్యంగా మూడు రాశులవారి ఫ్యూచర్ మారబోతుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరోగమన గురుడు ఈ 3 రాశులకు వరం
మేషం- బృహస్పతి తిరోగమనం సెప్టెంబర్ నుండి మేషరాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీరు పనిలో శుభఫలితాలను పొందుతారు. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. మీ లాభాలు పెరుగుతాయి. వ్యాపారం బాగా సాగుతుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. అంతేకాకుండా మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది. మీరు డబ్బును ఆదా చేస్తారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. 
మిథునరాశి- దేవగురువు బృహస్పతి యొక్క రివర్స్ కదలిక మిధున రాశి వారికి కలిసి వస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ తోపాటు ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. మీరు ఊహించని లాభాలను పొందుతారు. మీకు కోరుకున్న పదవి లభిస్తుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. 


Also Read: Shukra Vakri 2023: శత్రువు రాశిలో తిరోగమనం చేయబోతున్న శుక్రుడు.. ఈ 4 రాశులకు కష్టాలు షురూ..


కర్కాటకం- గురు గ్రహం వ్యతిరేక కదలిక వల్ల మీరు కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీ లాభాలు పెరుగుతాయి. మీ ఆదాయం పెరగడంతో మీ ఆర్థిక చింతలన్నీ దూరమవుతాయి. ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. 


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Mangal Shukra Yuti 2023: సింహరాశిలో కుజుడు-శుక్ర కూటమి.. ఈ 3 రాశులకు పట్టనున్న అదృష్టం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook