Jupiter rise 2023: త్వరలో ఉదయించబోతున్న దేవగురు... ఈ రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..
Guru Uday 2023: త్వరలో దేవగురు బృహస్పతి ఉదయించబోతున్నాడు. ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
Guru Uday 2023: బృహస్పతి సంపద, ఆస్తి, విద్య, పిల్లలు, జీవిత భాగస్వామి మరియు ఉన్నత స్థానాన్ని ఇచ్చే గ్రహంగా పరిగణించబడుతుంది. ఎవరి జాతకంలో బృహస్పతి బలమైన స్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. దేవగురు బృహస్పతి మార్చిలో ఉదయించబోతున్నాడు. జ్యూపిటర్ ఉదయించడం కొంతమంది అదృష్టం తెరుచుకోనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
బృహస్పతి ఉదయం ఈ రాశులకు శుభప్రదం
కుంభం (Aquarius): గురుగ్రహం ఉదయించడం కుంభరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. దీంతో మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈ సమయంలో విద్య, మీడియా రంగాలకు సంబంధించిన వ్యక్తులు మీరు లాభపడతారు.
కర్కాటక రాశి (Cancer): మార్చిలో ఉదయించబోతున్న బృహస్పతి సంచారం వల్ల కర్కాటక రాశి వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. మీరు వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అది మీకు లాభిస్తుంది.
మిథునం (Gemini): గురుగ్రహం ఈ రాశులవారికి శుభవార్తను తెస్తుంది. కెరీర్ మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. కోరుకున్న స్థానానికి ట్రాన్సఫర్ అవుతారు. పారిశ్రామికవేత్తలకు ఈ సమయం చాలా బాగుంటుంది.
మీనం (Pisces): ఈ రాశి వారికి బృహస్పతి ఉదయించడం వల్ల అనుకోకుండా లాభపడతారు. మీరు డబ్బు పొందవచ్చు. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు తలపెట్టిన పనిలో విజయం లభిస్తుంది. మీ శ్రమకు తగిన ఫలితాలను పొందుతారు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ విశ్వాసాలు మరియు మతపరమైన సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Surya Dev: ఈ ఏడాది సూర్యుడు తన రాశిని ఎప్పుడు, ఎన్నిసార్లు ఛేంజ్ చేయనున్నాడో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook