Guru Asta 2023: ఇవాళ మీనరాశిలో గురుడు అస్తమయం.. రాబోయే 32 రోజులపాటు ఈ రాశులవారు జాగ్రత్త..
Guru Asta 2023: ఇవాళ దేవగురు బృహస్పతి మేషరాశిలో అస్తమించనున్నాడు. దీంతో రాబోయే నెలరోజులపాటు కొన్ని రాశులవారు అప్రమత్తంగా ఉండాలి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Guru Asta 2023 effect: హిందూ క్యాలెండర్ ప్రకారం, అదృష్టం మరియు సంతోషాలకు అధిపతి అయిన బృహస్పతి ఈరోజు రాత్రి 07.12 గంటలకు మీనరాశిలో అస్తమించనున్నారు. బృహస్పతి యొక్క అస్తమయం కొన్ని రాశులవారిపై శుభ మరియు అశుభ ప్రభావాలను చూపుతుంది. మళ్లీ గురుడు మే 2, మంగళవారం నాడు ఉదయించనున్నాడు. బృహస్పతి అస్తమించే కాలంలో కొన్ని రాశులవారు అప్రమత్తంగా ఉండాలి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
కుంభ రాశి
కుంభ రాశి వారు గురుగ్రహం కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు శని సడేసతి ప్రభావానికి లోనవుతారు. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఇతరులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమయంలో అస్సలు పెట్టుబడులు పెట్టకండి.
సింహరాశి
గురు అస్తమయం యొక్క అశుభ ప్రభావం సింహరాశి వారిపై కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు క్షీణిస్తాయి. అన్నీ నోటి దగ్గరకు వచ్చి జారిపోతూ ఉంటాయి. మీ ఏకాగ్రత లోపిస్తుంది. మీకు మతపరమైన పనులపై ఆసక్తి ఉండదు.
మేషరాశి
మేష రాశి వారికి బృహస్పతి అస్తమించడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోంటారు. మీరు కొత్త పనిని ప్రారంభించడానికి ఈ సమయం మంచిది కాదు. మీకు వ్యాపారంలో భారీగా నష్టాలు వస్తాయి. మీరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి.
Also Read: Budh Gochar 2023: జూన్ 07 వరకు ఈ 3 రాశులకు కష్టాలే కష్టాలు.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook