Guru Gochar 2023 effect: ఆస్ట్రాలజీలో బృహస్పతిని దేవగురువుగా భావిస్తారు. ఇతడిని అదృష్టం, సంతోషం మరియు వివాహానికి కారకుడిగా భావిస్తారు. సంవత్సరానికొకసారి గురుడు తన రాశిని మారుస్తాడు. ఏప్రిల్ 22న బృహస్పతి తన రాశిని మార్చి మేషరాశిలో సంచరించింది. ఇప్పుడు గురుడు మే 1, 2024 వరకు మేషరాశిలో ఉంటాడు. బృహస్పతి యెుక్క శుభదృష్టి కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం: దేవగురువు బృహస్పతి తొమ్మిదవ దృష్టి మేష రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మీకు ప్రతి విషయంలో లక్ కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. మీరు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. మీరు శుభకార్యంలో పాల్గొనే అవకాశం ఉంది. 
మిథునరాశి: గురుడు శుభదృష్టి మిథున రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. మీరు మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 


Also Read: Lucky Zodiac Sign: మరో 2 రోజుల తర్వాత ఈ 5 రాశులకు అదృష్టం.. మీరున్నారా?


సింహ రాశి: బృహస్పతి సంచారం సింహరాశి వారికి చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీరు అపారమైన సంపదను పొందుతారు. మీకు అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Mangal Gochar 2023: జూలై 01న అంగారకుడి సంచారం.. ఈరాశుల జీవితాల్లో తుఫాన్ ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి