జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందుతుంది. ఫలితంగా  వివిధ జాతకాలపై ప్రభావం పడుతుంటుంది. ఏప్రిల్ 22వ తేదీన గురుడు మీనరాశి నుంచి మంగళ గ్రహ రాశి మేషంలో ప్రవేశించననున్నాడు. ఈ సందర్భంగా మొత్తం 12 రాశుల జాతకాల జీవితంపై శుభ, అశుభ ప్రభావం కన్పించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశిలో గురుడు ఏంగా 12 ఏళ్ల తరువాత గోచారం చేయనున్నాడు. దాంతో ఈ గోచారానికి అత్యంత ప్రాధాన్యత, మహత్యం ఏర్పడింది. గురు గోచారంతో ఏయే రాశులపై ధనలాభం, కెరీర్‌పరంగా వృద్ధి ఉండనుందో తెలుసుకుందాం..ముఖ్యంగా మేషరాశి, కర్కాటక రాశి, మీన రాశి జాతకులకు ఊహించని ధనలాభం కలగనుంది. 


మేషరాశి


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువు మేషరాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశి జీవితంలో శుభ ఫలాల వసంతమే కురవనుంది. ఈ గోచారం ఈ రాశి లగ్నపాదంలో ఉండనుంది. ఈ క్రమంలో మీకు పనిచేసే చోట శక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు పటిష్టమౌతాయి. ఈ సమయంలో పెళ్లికానివారికి సంబంధాలు వస్తాయి. వ్యాపారులకు కూడా ఈ సమయం లాభాల్ని ఆర్జింపచేస్తుంది. భాగస్వామ్య వాపారం చేసేవారికి ఈ సమయం అత్యంత అనుకూలం. 


కర్కాటక రాశి


జ్యోతిష్యుల ప్రకారం గురు గ్రహం గోచారంతో కర్కాటక రాశి జాతకులకు విశేషలాభాలు కలగనున్నాయి. ఈ గోచారం కర్కాటక రాశివారికి గోచారం కుండలిలో కర్మపాదంలో ఉంటుంది. ఈ పాదాన్ని ఉద్యోగం, పనిచేసే ప్రాంతపు స్థానంగా భావిస్తారు. ఈ క్రమంలో ఈ జాతకులకు ఆర్ధిక లాభాలు కలుగుతాయి. కెరీర్ ప్రారంభించేవారికి అత్యంత శుభసమయం. మంచి మంచి ఉద్యోగాల ఆఫర్లు లభిస్తాయి. అటు వ్యాపారులకు లాభాలు ఆర్జించేందుకు మంచి అవకాశముంటుంది. ఉద్యోగులకు ఈ సమయంలో పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి.


మీనరాశి


గురుడు మీనరాశి నుంచి మేషరాశిలో ప్రవేశించనున్నాడు. ఈ క్రమంలో మీనరాశివారికి ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి జాతకులకు గోచారం కుండిలో రెండవపాదంలో ఉండనుంది. ఈ స్థానాన్ని ధనానికి ప్రతీకగా భావిస్తారు. ఈ క్రమంలో మీనరాశి జాతకులకు ఊహించని ధనలాభం కలుగుతుంది. ఉన్నత చదువులు చదివేందుకు విదేశాలకు వెళ్లే యోగం ఉంటుంది. నిలిచిపోయిన డబ్బులు లభించేందుకు పూర్తి అవకాశాలున్నాయి.


Also read: Mahashivratri 2023: మహా శివరాత్రి నాడు శివుడిని ఎలా పూజిస్తే మంచిది, ఏ రంగు పూలు అర్పించాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook