Jupiter Transit 2023: ఆస్ట్రాలజీలో బృహస్పతిని దేవగురువు అని పిలుస్తారు. అంతేకాకుండా ఇతడిని జ్ఞానగ్రహం అని పిలుస్తారు. ఎప్పుడైతే గురువు ఒక రాశి నుండి మరోక రాశిలోకి వెళ్తాడో దాని ప్రభావం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 22న బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించింది. గురుడి ఈ రాశి మార్పు మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. దీంతో వీరు 18 నెలలపాటు భారీగా డబ్బును పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి
గురుడు సంచారం మేషరాశి వారికి శుభఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే గురుడు ఇదే రాశిలో సంచరిస్తున్నాడు. ఈ రాశి యెుక్క తొమ్మిదవ మరియు పన్నెండవ ఇంటికి అధిపతిగా బృహస్పతిని భావిస్తారు. దీంతో మీ డబ్బు సమస్యలన్నీ దూరమవుతాయి. మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది.
ధనుస్సు రాశి
బృహస్పతి ఈ రాశి యెుక్క ఐదవ ఇంట్లో కూర్చున్నాడు. దీంతో ధనస్సు రాశి వారు ఊహించని ధనలాభం పొందుతారు. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మెుత్తానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 


Also Read: Shukra Gochar 2023: జూలై 07 వరకు కర్కాటక రాశిలోనే శుక్రుడు.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం..


కర్కాటక రాశి
కర్కాటక రాశిలోని 10వ ఇంట్లో బృహస్పతి కూర్చున్నాడు. దీంతో మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగులు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. జాబ్ ఛేంజ్ అవ్వడానికి ఇదే మంచి సమయం. విద్యార్థులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. 


Also Read: Saturn Retrograde 2023: శని గ్రహంలో ఏర్పడనున్న కేంద్ర త్రికోణ రాజయోగం, జూన్ 17 నుంచి ఈ 4 రాశులకు మహర్దశ, పట్టిందల్లా బంగారం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook