Jupiter Transit 2023: గురువు మేషరాశి ప్రవేశం, ఆ ఒక్క రాశికి ఏడాదిపాటు ఎలా ఉంటుందో తెలుసా
Jupiter Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉన్నట్టే గ్రహాల అస్తమయం లేదా ఉదయించడం కూడా ప్రభావం చూపిస్తుంటుంది. ఒక్కొక్క రాశిపై ఒక్కోలా ఉంటుంది. గ్రహాల్లో శక్తివంతమైన గురుగ్రహం అస్తమించడం ఎలాంటి ప్రభావాన్ని చూపించనుందో తెలుసుకుందాం..
Jupiter Transit 2023: హిందూ పంచాంగంలో గ్రహాల గోచారం, ఒక రాశి నుంచి మరో రాశిలో మారడం విపరీత ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం గురు గ్రహం సైతం అస్తమిస్తోంది. ఏప్రిల్ 22 వరకూ ఇదే స్థితిలో ఉండి మేష రాశిలో ప్రవేశించనుండటం ఈ రాశులకు శుభసూచకం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గురుగ్రహం రాశి పరివర్తనం ఏప్రిల్ 22న జరగనుంది. ఆ రోజున గురుగ్రహం మేషరాశిలో ప్రవేశించి..మే 1 2024 వరకూ ఉండనున్నాడు. అంటే దాదాపు ఏడాది కాలం గురుడు మేషంలోనే ఉపస్థితుడై ఉంటాడు. ప్రత్యేకత ఏంటంటే మేషరాశిలో గురుడు అస్తమించే స్థితిలో ప్రవేశించి..వచ్చే ఏడాది అంటే 2024 మే 1న వృషభ రాశిలో ఉదయించే స్థితిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా కర్కాటక రాశి లగ్నపాదం వారికి గురుగ్రహం రాశి పరివర్తన ప్రభావం కెరీర్‌పై ఫోకస్ పెట్టేలా చేస్తుంది. అయితే కష్టపడాల్సి వస్తుంది.
కర్కాటక రాశి జాతకులు కష్టపడే విషయంలో వెనుకంజ వేయడం మంచిది కాదు. ప్రారంభంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా ఆ తరువాత మార్పు కన్పిస్తుంది. ఆఫీసుల్లో పనిచేసేవాళ్లకు కీలక గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెద్దగా పెరగకపోయినా పదోన్నతి కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కర్కాటక రాశి జాతకులు భూముల కొనుగోలులో పెట్టుబడులు పెట్టవచ్చు. వాహనం మార్చే పరిస్థితి ఉంటుంది. తల్లి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. నడుము నొప్పి, వీపు నొప్పితో బాధపడేవాళ్లు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. సర్వైకల్ సమస్యలుండేవాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపారంలో స్ఖిరపడేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎక్కువ లాభాలు ఆర్జించకుండా జాగ్రత్త వహించాలి. కస్టమర్లతో మంచి సంబంధాలు కొనసాగించాలి. నైతిక విలువలు, సిద్ధాంతాలు మర్చిపోకూడదు. నిబంధనల్ని దాటిపోకూడదు. విద్యార్ధులకు అనువైన సమయమే కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది. అప్పుడు మంచి ఫలితాలు కలుగుతాయి. ఎప్పటికప్పుడు పాఠ్యాంశాల్ని రివిజన్ చేసుకోవాలి. గురువుల్ని గౌరవించడం అలవాటు చేసుకోవాలి.
Also read; Surya Grahan 2023: సూర్యగ్రహణం నాడు అశుభ యోగం.. ఈ 5 రాశులవారికి నరకం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook