2023 Jupiter transit: సాధారణంగా గ్రహాల కదలిక ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. పురాణాల ప్రకారం, బృహస్పతిని దేవతల గురువుగా భావిస్తారు. ఇతడిని అదృష్టం, సంపద మరియు సంతానానికి కారకుడిగా పేర్కొంటారు. గురుడు సంవత్సరానికొకసారి తన రాశిని మారుస్తాడు. ప్రస్తుతం బృహస్పతి మేషరాశిలో సంచరిస్తోంది. 2024 వరకు అదే రాశిలో ఉంటుంది. మేషరాశిలో గురుడు సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనస్సు రాశి
గురుడు సంచారం ధనస్సు రాశి యెుక్క ఐదో ఇంట్లో జరగబోతుంది. పైగా ఈ రాశికి అధిపతి కూడా బృహస్పతే. దీంతో మీకు సంతానభాగ్యం ఉంటుంది. మీకు డబ్బుకు లోటు ఉండదు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఏదైనా విలువైనది కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
కర్కాటక రాశి
మేషరాశిలో బృహస్పతి సంచారం కర్కాటక రాశి యెుక్క కర్మస్థానంలో జరుగుతుంది. దీంతో ఈరాశివారు చాలా ప్రయోజనాలు పొందనున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభిస్తారు. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులు భారీ లాభాలు ఉంటాయి.
సింహ రాశి
జ్యూపిటర్ సంచారం సింహరాశి వారి జాతకంలో తొమ్మిదో ఇంట్లో సంభవించబోతుంది. దీంతో మీకు ప్రతి  పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కెరీర్ కు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోరికలు నెరవేరుతాయి. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 


Also Read: Venus Rise 2023: మరో 10 రోజుల్లో ఉదయించబోతున్న శుక్రుడు.. ఈ 3 రాశులకు లాభాలు బోలెడు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి