Guru Gochar 2023: మేషరాశిలోకి ఎంటర్ అవ్వబోతున్న గురుడు.. ఈ 4 రాశుల కెరీర్ అద్భుతం..
Jupiter transit 2023: జ్ఞానానికి కారకుడైన బృహస్పతి వచ్చే నెలలో తన రాశిని మార్చనున్నాడు. గురుడు రాశి మార్పు కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Guru Gochar 2023: ఏప్రిల్ నెలలో బృహస్పతి గ్రహం గమనంలో మార్పు రానుంది. బృహస్పతి జ్ఞానానికి, ఆధ్యాత్మికతకు మరియు శుభ కార్యాలకు కారకుడిగా భావిస్తారు. ప్రస్తుతం బృహస్పతి మీనరాశిలో సంచరిస్తున్నాడు. మళ్లీ గురుడు ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 06:12 నిమిషాలకు మీనరాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. రాహు గ్రహం ఇప్పటికే మేషరాశిలో కూర్చున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి కలిసిరాదు. మేషరాశిలో బృహస్పతి సంచారం కారణంగా నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
బృహస్పతి సంచారం ఈ రాశులకు వరం
1. మేషం
మేష రాశి వారికి బృహస్పతి సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఇది ఉద్యోగస్తులకు బాగుంటుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. పురోగతికి దారులు తెరుచుకుంటాయి. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీరు లవ్ లో సక్సెస్ అవుతారు.
2. కర్కాటకం
కర్కాటక రాశి వారికి గురు సంచారం శుభ ఫలితాలనిస్తుంది. మీరు అన్ని పనులలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా మునుపటి కంటే బలపడతారు.ధనలాభం పొందే అవకాశం ఉంది. దుర్గామాత బీజ మంత్రాన్ని జపించడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
3. సింహం
ఏప్రిల్‌లో బృహస్పతి సంచారం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. వ్యాపారులకు ఈ సమయం సూపర్ గా ఉంటుంది. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
4. తులారాశి
తుల రాశి వారు తమ కెరీర్‌లో విజయం సాధిస్తారు. ఉద్యోగ వృత్తిలో ఉన్నవారికి గౌరవం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
Also read: Ram Navami 2023: ఈ 3 రాశులకు శ్రీరామ నవమి చాలా ప్రత్యేకం.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి