Guru Gochar 2023: అరుదైన యోగాన్ని చేస్తున్న గురుడు.. ఈ మూడు రాశులపై కనకవర్షం...
Gajlakshmi Yoga: హోలీ తర్వాత బృహస్పతి సంచారం కారణంగా గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశులవారికి అదృష్టం ప్రకాశించనుంది. ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి.
Jupiter Transit In Aries 2023: ప్రతి గ్రహం ఏదో ఒక సందర్భంలో శుభ లేదా అశుభ యోగాలను సృష్టిస్తాయి. త్వరలో బృహస్పతి ఏప్రిల్‌లో మేషరాశిలో సంచరించబోతున్నాడు. దీని కారణంగా అరుదైన గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా శుభకరమైనదిగా భావిస్తారు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. ఈ యోగం వల్ల మూడు రాశులవారు మంచి లాభాలను గడిస్తారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
గజలక్ష్మీ రాజయోగం ఈరాశులకు శుభప్రదం
మేషరాశి
ఈ రాశిలోనే బృహస్పతి సంచారం జరుగుతుంది. దీంతో మీరు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి మంచిరోజులు ప్రారంభమవుతాయి. ఉద్యోగం సాధించాలనే వారి కోరిక నెరవేరుతుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
గురు సంచారం నుండి ఏర్పడిన గజలక్ష్మీ రాజ్యయోగం ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. బృహస్పతి ఈ రాశిచక్రంలోని ఐదవ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
మిధునరాశి
మిథునరాశి వారికి గజలక్ష్మి రాజయోగం అనుకూలంగా ఉంటుంది. బృహస్పతి మీ రాశిచక్రం యొక్క ఆదాయ గృహంలో సంచరించబోతున్నాడు. దీంతో మీ ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఉద్యోగస్తులకు సహచరుల మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా మీలో ధైర్యం పెరుగుతుంది.
Also read: Mangal Gochar 2023: మిథునరాశిలోకి ప్రవేశించబోతున్న కుజుడు.. హోలీ తర్వాత మారనున్న ఈరాశుల జాతకం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook