Jupiter Transit: 2023లో గజలక్ష్మి యోగం ఈరాశుల వారిని కోటీశ్వరులను చేస్తుంది.. ఇందులో మీరున్నారా?
Gajlakshmi Yog: సాధారణంగా గ్రహాల సంచారం ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. నూతన సంవత్సరం ప్రారంభంలో కొన్ని రాశులవారి అదృష్టం తెరుచుకోనుంది.
Guru Rashi Parivartan 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం నిర్ణీత సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. 2023 సంవత్సరంలో దేవగురువు బృహస్పతి తన రాశిని ఛేంజ్ చేయనున్నాడు. గురు గ్రహం తన స్థానాన్ని మార్చుకుని మేష రాశిలోకి ప్రవేశించనుంది. బృహస్పతి యెుక్క ఈ సంచారం (Guru Gochar 2023) కారణంగా అరుదైన గజలక్ష్మీ యోగం ఏర్పడుతోంది. ఈ యోగాన్ని ఆస్ట్రాలజీలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీని ప్రభావం మానవ జీవితంపై ఖచ్చితంగా ఉంటుంది. ఈయోగం కారణంగా మూడు రాశులవారి సంపద రెట్టింపు కానుంది.
మేషం (Aries)- బృహస్పతి సంచారం ఈ రాశిలోనే జరుగుతుంది కాబట్టి వీరికి గజలక్ష్మీ యోగం ప్రయోజనకరంగానే ఉంటుంది. మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. కెరీర్‌లో కొత్త శిఖరాలను అధిరోహిస్తారు.వ్యాపారులు లాభపడతారు. ఉద్యోగుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ సంసార బంధం అద్భుతంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా బలపడతారు.
ధనుస్సు (Sagittarius)- ధనుస్సు రాశి వారికి బృహస్పతి సంచారం ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. ప్రేమ జీవితం బాగుంటుంది. ఈ సమయంలో మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ఈ రాశి వారు తమ కెరీర్‌లో ఉన్నత స్థానాన్ని పొందుతారు. ఏదైనా జాబ్ చేయడానికి ఇదే మంచి సమయం. మీరు దీర్ఘకాలిక వ్యాధి నుండి బయటపడతారు.
మిథునరాశి (Gemini)- బృహస్పతి సంచారం మిథునరాశి వారికి బలమైన ప్రయోజనాలను ఇస్తుంది. మీకు అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఈ సమయంలో పాత పెట్టుబడుల మీకు లాభాలను ఇస్తాయి. ఉద్యోగస్తుల జీతం పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
Also Read: Mercury Gochar 2022: ఇవాళ శనిదేవుడి రాశిలోకి బుధుడు.. వీరు పట్టిందల్లా బంగారమే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.