Purnima Vrat 2022: జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున పూర్ణిమ వ్రతం పాటించబడుతుంది. పూర్ణిమ వ్రతం జూన్ 14, మంగళవారం నాడు (Jyeshtha Purnima Vrat on 14 June 2022) వస్తుంది. ఈ రోజున  మహిళలు ఈ వ్రతం చేయండ వల్ల ఆమె భర్త దీర్ఘాయుషు పొందడంతోపాటు సంతోషకరమైన వైవాహిక జీవితం ఉంటుంది. జ్యేష్ఠ పూర్ణిమ రోజున నదీస్నానం చేసిన తర్వాత దానం చేసే సంప్రదాయం కూడా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్ల పక్ష పౌర్ణమి రోజున ఉపవాసం ఆచరించి, సత్యనారయణుడిని పూజిస్తారు. ఇది కుటుంబంలో ఆనందం, శాంతి మరియు పురోగతిని కలిగిస్తుంది. పౌర్ణమి రాత్రి లక్ష్మీ దేవిని పూజించడం వలన సంపద పెరుగుతుంది. ఈ రాత్రి పౌర్ణమి చంద్రుడిని పూజించడం వల్ల చంద్ర దోషం తొలగిపోయి జీవితం ఆనందంగా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో జ్యేష్ఠ అమావాస్య నాడు వట్ సావిత్రి వ్రతం ( Vat Savitri vrat 2022) పాటిస్తారు. 


జ్యేష్ఠ పూర్ణిమ వ్రతం 2022 తేదీ: 
పంచాంగం ఆధారంగా చూస్తే, జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి జూన్ 13వ తేదీ సోమవారం రాత్రి 09:02 గంటలకు ప్రారంభమై.... జూన్ 14, మంగళవారం సాయంత్రం 05.21 వరకు ఉంటుంది. అయితే వ్రతాన్ని ఉదయం పూట చేయాలి.  


పూజ ముహూర్తం 2022: 
జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఉదయం 09.40 గంటల వరకు ప్రాప్తి యోగం. ఆ తర్వాత రాత్రంతా శుభ యోగం ప్రారంభమవుతుంది. ఆ రోజు శుభ సమయం ఉదయం 11.54 నుండి మధ్యాహ్నం 12.49 వరకు. మీరు జూన్ 14న ఉదయం పూర్ణిమ వ్రతాన్ని చేయవచ్చు. రాత్రి సమయంలో చంద్రుని పూజించండి. 


చంద్రోదయ సమయం: 
జ్యేష్ఠ పూర్ణిమ నాడు రాత్రి 07.29 గంటలకు చంద్రోదయం (Moon Rising time) జరుగుతుంది. మూన్‌సెట్ సమయం అందుబాటులో లేదు. పూర్ణిమ నాడు చంద్రుడిని ఆరాధించడానికి రాత్రి ఎక్కువ సేపు మేల్కొని ఉండనవసరం లేదు. ఆ రాత్రి నీళ్లలో పాలు, పంచదార, పూలు, అక్షతలను కలిపి చంద్రునికి సమర్పించాలి. జాతకంలో చంద్రునికి సంబంధించిన దోషాలు ఉంటే తొలగిపోతాయి. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి, పౌర్ణమి రాత్రి లక్ష్మీ దేవికి సంబంధించిన చర్యలు తీసుకుంటారు. అయితే, ఈ రాత్రి మాతా లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా మీరు మీ ఆర్థిక పురోగతికి మార్గం తెరవగలరు. 


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Friday Mantra: శుక్రవారం నాడు ఈ సూక్తం చదివితే.. అపారమైన సంపద, ఆనందం మీ సొంతమవుతుంది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook