Kalasarpa Dosha Remedies In Telugu 2024: హిందూ సాంప్రదాయం ప్రకారం నాగుల పంచమికు కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పంచమి ప్రతి సంవత్సరం శ్రావణమాసంలోని శుక్లపక్షంలో వస్తుంది. నాగుల పంచమి రోజున నాగదేవతలను పూజించడం ద్వారా అన్ని సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభించి కష్టాలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఈ సమయంలో నాగదేవతలను పూజించే వారికి కాలసర్ప దోషం నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అందుకే చాలామంది భక్తులు నాగుల పంచమి రోజున నాగదేవతలకు పాలాభిషేకం చేసి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రత్యేకమైన ఉపవాసాలు కూడా పాటిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం నాగుల పంచమి ఆగస్టు 9వ తేదీ శుక్రవారం రాబోతోంది. ఈరోజు శుక్లపక్షంలోని తొమ్మిదవ రోజు కావడంతో నాగుల పంచమిని జరుపుకుంటారు. ఇక నాగుల పంచమి శుభ సమయాల విషయానికొస్తే ఆగస్టు 9వ తేదీన ఉదయం 12 గంటలకు ప్రత్యేకమైన తిథి ప్రారంభం అవుతుంది. ఇది పదవ తేదీ తెల్లవారి జామున వరకు కొనసాగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పంచాంగం ప్రకారం ఈ పండుగను శుక్లపక్షమి ఆగస్టు 9వ తేదీన జరుపుకోవడమే మంచిదని వారి అభిప్రాయం.


హిందూ సాంప్రదాయం ప్రకారం నాగపంచమి రోజున దేవతలను పూజించే క్రమంలో పెరుగు, అన్నం, నిమ్మకాయ, వేప, దోసకాయలతో కలిపిన ఒక ప్రత్యేకమైన వంటకాన్ని నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ వంటకాన్ని కాలసర్పదోషంతో బాధపడుతున్న వారు దేవతలకు సమర్పించి ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం వల్ల దోషం నుంచి విముక్తి కలుగుతుంది. దీంతో పాటు ఈరోజు కాలసర్ప దోషం తో బాధపడేవారు మృత్యుంజయ మంత్రాన్ని కూడా పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. 


అలాగే నాగుల పంచమి రోజున శివారాధన చేయడం కూడా చాలా శుభప్రదమట.. ఈరోజు శివలింగంపై గంగాజలంతో పాటు నల్ల నువ్వులతో అభిషేకం చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా చాలామంది హిందువులు ఈరోజు నదీ స్నానాన్ని ఆచరించి నదిలో వెండి లేదా రాగి వస్తువులను వదులుతారంట. ఇలా చేయడం వల్ల అన్ని దేవతల అనుగ్రహం లభించి జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే సర్ప దోషంతో బాధపడుతున్న వారు నాగపంచమి రోజున తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ముఖ్యంగా నాగ పంచమి రోజున ఎట్టి పరిస్థితులలో భూమిని తవ్వకూడదట. ఇలా చేయడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ఈరోజు రైతులు నాగలితో భూమిని దున్నడం కూడా అంత మంచిది కాదని వారంటున్నారు. అలాగే చాలామంది ఈరోజు ఇనుప పాత్రల్లో ఆహారాలను వండుతూ ఉంటారు నిజానికి ఇలా చేయడం మంచిది కాదట. అంతేకాకుండా  నాగుల పంచమి రోజు ఎట్టి పరిస్థితుల్లో సూదిలో దారం పెట్టకూడదని ఒక బలమైన నమ్మకం హిందూ సాంప్రదాయంలో ఉంది. కాబట్టి కాలసర్ప దోషంతో బాధపడేవారు పై పనులు అస్సలు చేయకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.