Kamika Ekadashi 2023: కామిక ఏకాదశి నాడు శుభ యోగం.. ఈ 3 రాశులకు శ్రీహరి ప్రత్యేక ఆశీస్సులు..
Kamika Ekadashi 2023: ఈ సంవత్సరం కామికా ఏకాదశి జూలై 13న రాబోతుంది. దీనినే చాత్ముర్మాసం తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Kamika Ekadashi 2023 date: శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశినే కామిక ఏకాదశి అని పిలుస్తారు. ఇది ఈ సంవత్సరం జూలై 13న రాబోతుంది. ఈ ఏకాదశినే చాత్ముర్మాసం తొలి ఏకాదశిగా పిలుస్తారు. ఈ సమయంలో విష్ణువు క్షీర సాగరంలో విశ్రాంతి తీసుకుంటాడు. చాతుర్మాస ఏకాదశి నాడు శ్రీ హరిని ఆరాధించడం వల్ల మీరు పాపాల నుండి విముక్తి పొందుతారు. ఈ సారి కామిక ఏకాదశి నాడు కొన్ని రాశుల వారికి శుభం కలుగనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
కామికా ఏకాదశి 2023 తేదీ మరియు సమయం
కామిక ఏకాదశి తిథి ప్రారంభం - జూలై 12, సాయంత్రం 05.59 నిమిషాలు
కామిక ఏకాదశి తిథి ముగింపు - జూలై 13, సాయంత్రం 06.24
కామికా ఏకాదశి వ్రతం - జూలై 13, ఉదయం 5.32 నిమిషాల నుండి జూలై 14 ఉదయం 8.18 నిమిషాలు
కామికా ఏకాదశి 2023 శుభ యోగం
ఈ సంవత్సరం కామిక ఏకాదశిని జూలై 13, గురువారం జరుపుకుంటారు. ఏకాదశి తిథి దేవగురువు బృహస్పతి మరియు విష్ణువుకు చాలా ప్రీతికరమైనవి. ఈ రోజున శూల యోగం మరియు బుధాదిత్య యోగాలు ఏర్పడతాయి. జూలై 12 ఉదయం 9.40 నుండి జూలై 13 ఉదయం 8.53 వరకు శూల యోగం ఉంటుంది. పంచాంగం ప్రకారం, జూలై 11 న బుధుడు కర్కాటకంలో ఉదయించబోతున్నాడు. బుధుడు ఉదయించడం మరియు కామిక ఏకాదశి కారణంగా మూడు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Also read: Sun transit 2023: జూలై 16 నుంచి ఈ 4 రాశులకు మహార్దశ.. ఇందులో మీ రాశి ఉందా?
కన్య రాశి
కన్యా రాశి వారికి బుధుడు ఉదయించడం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
మకరరాశి
బుధుడు ఉదయించడం మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీరు న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు.
మిధునరాశి
మిథునరాశి వారికి బుధుడు ఉదయించడం శుభప్రదంగా ఉంటుంది. మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
Also read: Guru Gochar 2023: రేపు మేష రాశిలో అరుదైన కలయిక.. ఈ 3 రాశులవారి సుడి తిరగబోతుంది.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook