Karthika Pournami 2022: ఈ రోజు రాత్రి కార్తీక పూర్ణిమ జరుపుకోవచ్చా..తులసి పూజ ప్రముఖ్యత..
Karthika Pournami 2022 Timings: చంద్రగ్రహణం కారణంగా కొన్ని ముహూర్తాల్లో మాత్రమే తులసి పూజలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజు శ్రీ విష్ణువు నదిలో ఉంటాడు కాబట్టి తప్పకుండా నది స్నానాలు చేయాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Karthika Pournami 2022 Timings: ఈ సంవత్సరం కార్తీక పూర్ణిమ నవంబర్ 8న వచ్చింది. అయితే ఇదే రోజూ చంద్రగ్రహణం ఉండడంతో భక్తులంతా గందరగోళ పరిస్థితుల్లో పడ్డారు. అయితే ఈ రోజూ హిందువు భక్తులకు ఎంతో ప్రముఖ్యమైనది కాబట్టి ఈ రోజంతా ఉపవాసాలతో పూజా కార్యక్రమాలు చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సకల శుభాలు లభించడమేకాకుండా అన్ని రకాల ప్రయోజనాలు చేకూరుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో శ్రీ లక్ష్మి దేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయని శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ రోజు చంద్రగ్రహణం ఏర్పడునుంది కాబట్టి ఈ క్రమంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు, పూజా విధానాలు ఇప్పుడు తెలుసుకుందాం..
చంద్ర గ్రహణం కారణంగా గంగా నదిలో స్నానం చేయోచ్చా..?:
కేవలం గంగా నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు నశించి అనంతమైన పుణ్యం లభిస్తుందని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రోజూ పూజ కార్యక్రమంలో భాగంగా పూజలు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారని నిపుణులు తెలుపుతున్నారు.
కార్తీక పూర్ణిమ రోజు దీపదానం చేయడం వల్ల కలిగే ప్రాముఖ్యత:
కార్తీక పౌర్ణిమ రోజున ప్రదోష కాలంలో నది, చెరువు దగ్గర దీపదానం చేయడం వల్ల విశేష విశిష్టత లభిస్తుంది. అయితే ఈ రోజు బ్రహ్మ ముహూర్తంలో నది స్నానం చేసి దీపాలు వెలించి దానం చేయడం వల్లు ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
కార్తీక పౌర్ణిమ శుభ సమయం:
కార్తీక పౌర్ణిమ తిథి 07 నవంబర్ 2022న సాయంత్రం 04:15 గంటలకు ప్రారంభమై..నవంబర్ 08న సాయంత్రం 04:31 గంటలకు ముగుస్తుంది. పౌర్ణమి నాడు సాయంత్రం 04.31 గంటల వరకు స్నానాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
కార్తీక మాసంలో పూజా కార్యక్రమాలు:
కార్తీక మాసం విష్ణుమూర్తిని పూజించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా పౌర్ణిమ రోజు విష్ణువు మత్స్య అవతారంలో ఉంటాడు. కాబట్టి ఈ క్రమంలో గంగాస్నానం చేసిన తర్వాత దీపదానం చేయాలని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ రోజును దేవ్ దీపావళీ కూడా అంటారు. ఈ రోజు పూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి భక్తుల ప్రత్యేక సమయాల్లో మాత్రమే పూజలు చేయాల్సి ఉంటుంది.
తులసి పూజ చేయాలి:
కార్తీక పౌర్ణమి రోజు తులసిని పూజిస్తే..అమ్మ అనుగ్రహవం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.అందుకే కార్తీక పూర్ణిమ రోజున తులసిని పూజిస్తే..లక్ష్మి అనుగ్రహంతో వివాహాలు జరుగుతాయని శాస్త్రంలో పేర్కొన్నారు.
కార్తీకమాసంలో విష్ణువు నీటిలో ఉంటాడు.
కార్తీకమాసంలో శ్రీ విష్ణువు నీటిలో ఉంటాడని పుర్వీకలు చెబుతారు. విష్ణువు మత్స్య రూపంలో పవిత్ర నదులు, నీటి వనరులలో నివసిస్తాడని పద్మ పురాణంలో కూడా పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలో స్నానాలు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.
Also Read : KomatiReddy Rajagopal Reddy: తమ్ముడు ఓటమికి అన్న కారణామా?.. రాజ్ గోపాల్ రెడ్డి కొంపముంచిన కాంగ్రెస్
Also Read : Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సస్పెండ్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook