Kartik Purnima 2022 Date And Time: ప్రతి సంవత్సరం వచ్చే కార్తీక మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమిని కార్తీక పూర్ణిమ అని అంటారు. సనాతన ధర్మంలో ఈ రోజుకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా స్త్రీలందరూ ఈ రోజున భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజించి నైవేద్యాలు సమర్పిస్తారు. అంతేకాకుండా  రోజును దేవ్ దీపావళి అని కూడా అంటారు.  అయితే ఈ సంవత్సరం దీపావళి నవంబర్ 8వ తేదీన వచ్చింది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున భక్తితో లక్ష్మీని పూజించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఈ క్రమంలో తప్పుడు పనులు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రోజున ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 
ఈ నియమాలు తప్పని సరిగా పాటించాల్సి ఉంటుంది:
>>పౌరాణిక విశ్వాసాల ప్రకారం..ఈ రోజున విష్ణువు మత్స్యావతారం దర్శనమిస్తాడు. అంతేకాకుండా ఇదే అవతారంలో త్రిపురాసురుడు అనే రాక్షసుడినికి కూడా సంహరిస్తాడు. అయితే కార్తీక పూర్ణిమ నాడు సూర్యోదయానికి ముందు ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేస్తే అనుకున్న కోరికలు తీరుతాయి. కాబట్టి భక్తితో అందరు పవిత్రమైన నదిలో స్నానం చేయాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

>>కార్తీక పూర్ణిమ రోజున దేవాలయం దగ్గర దీపాన్ని దానం చేయాలి. ఈ రోజున దీపాలను దానం చేయడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రోజు వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని పురాణాల్లో పేర్కోన్నారు.  నీటిలో పచ్చి పాలు, బియ్యం, కొంచెం చక్కెర వేసి చంద్రునికి అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయడం వల్ల చంద్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది.


>>లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి తప్పకుండా పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. లక్ష్మిదేవికి కార్తీక పూర్ణిమ అంటే చాలా ఇష్టం కాబట్టి అనుగ్రహం కోసం తప్పకుండా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.


>>కార్తీక పూర్ణిమ రోజున గుడ్డు, ఉల్లి, వెల్లుల్లిని అస్సలు తినకూడదని జోషిత్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మత్తు పదార్థాలు కూడా వినియోగించవద్దని నిపుణులు తెలుపుతున్నారు. భక్తితో రోజంతా గడపాల్సి ఉంటుంది.


>>కార్తీక పూర్ణిమ రోజున చంద్రుని అనుగ్రహం పొందడానికి బ్రహ్మచర్యం పాటించాలి. రాత్రి పూట నేలపై పడుకుంటే అంతా మంచి జరుగుతుందని జోతిష్య శాస్త్ర నిపుణలు పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలో తప్పకుండా జీవితంలో అన్ని మంచి జరగగడానికి పై నియమాలు పాటించాల్సి ఉంటుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read: India Vs Bangladesh Preview: లైట్ తీసుకుంటే షాక్ తప్పదు.. బంగ్లాకు చుక్కలు చూపియాల్సిందే..!


Also Read: Betel leaves Benefits: ఆ ఆకులతో అల్సర్, మధుమేహం, మలబద్ధకం సమస్యకు చెక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి