Karwa Chauth 2020 wishes and greetings: కర్వా చౌత్, భావోద్వేగాలతో అల్లిన ప్రేమ, అనుబంధాన్ని, అందమైన భారతీయ సంస్కృతికి నిదర్శనంగా జరుపుకునే పండుగ. ఉత్తర భారతదేశం అంతటా జరుపుకునే ప్రముఖ పండుగలలో కర్వా చౌత్ ఒకటి. ఈ సంవత్సరం కర్వా చౌత్ నవంబర్ 4న అంటే ఈ రోజు జరుపుకుంటాం. కర్వా చౌత్‌ను హిందూ క్యాలెండర్ ( Hindu calendar ) ప్రకారం కార్తీక మాసం కృష్ణ పక్ష చతుర్థి రోజున జరుపుకుంటారు. అంతేకాకుండా, ఈ సంవత్సరం వినాయకుడిని ఆరాధించే సంకష్తి చతుర్థి కూడా ఈ కర్వా చౌత్ పర్వ దినానే వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Karwa Chauth vrat vishist : కర్వా చౌత్ వ్రత ముహూర్తం:
చతుర్థి ముహూర్తం నవంబర్ 4 బుధవారం రోజున తెల్లవారుజామున 3.24 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే కర్వా చౌత్ సాయంత్రం పూజ ముహూర్తం సాయంత్రం 5:34 నుండి 6:52 వరకు ఉంటుంది. ఈ సంవత్సరం కర్వాచౌత్ నాడు ఉదయం 6:35 నుండి రాత్రి 8:12 వరకు, 13 గంటల 37 నిమిషాల పాటు మహిళలు ఉపవాసం ఉంటారు. 


Photo gallery : Karwa Chauth Mehndi Designs 2020: కర్వా చౌత్ మెహెందీ స్పెషల్ డిజైన్లు చూశారా..


Karwa Chauth significance: కర్వా చౌత్ ప్రాముఖ్యత:
ఉత్తర భారతదేశంలో జరుపుకునే ఈ పండుగ అనేక సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాల కలయిక. ఈ రోజు మహిళలు కొత్తగా పెళ్లయిన వధువులుగా దుస్తులు ధరిస్తారు. అందమైన చీరలు ధరించి మెహందీ పెట్టుకొని అందంగా ముస్తాబవుతారు. హిందూ పురాణాల ప్రకారం, కర్వా చౌత్ రోజున స్త్రీలు శివుడిని ఆరాధిస్తారు. 


Karwa Chauth special: కర్వాచౌత్ ఎలా జరుపుకుంటారు :
కర్వాచౌత్ నాడు స్త్రీలు సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసం ఉంటారు. అలాగే తన భర్త ఆయురారోగ్యాలతో, దీర్గాయుష్షూతో ఉండాలని ప్రార్థిస్తారు. కర్వా చౌత్ వ్రతంని చాలా కఠినంగా పాటిస్తారు. ఉపవాసం ఉన్న మహిళలు సూర్యోదయం తరువాత ఒక్క చుక్క నీటిని కూడా తీసుకోరు. సాయంత్రం చంద్రున్ని చూసిన తరువాతనే వారు నీరు తాగి, ఆహారం తీసుకోవడం ద్వారా ఉదయం నుంచి చేసిన ఉపవాస దీక్షను విడుస్తారు.


Karwa Chauth story: కర్వాచౌత్ కథ:
సూర్యాస్తమయం తరువాత, మహిళలందరు సమావేశమై కర్వా చౌత్ కథ వింటారు. చంద్రోదయం తరువాత, జల్లెడ ద్వారా నీటిలో చందమామ ప్రతిబింబం చూస్తారు. కర్వా చౌత్‌‌లో కర్వా అంటే మట్టి కుండ. ఆ మట్టి కుండతో నీటిని చంద్రునికి ఆరబోయడాన్ని అర్గ అని పిలుస్తారు, అర్ఘాను చంద్రునికి అర్పించడంతో ఉపవాస దీక్ష పూర్తవుతుంది. ఆ తరువాత ఉపవాసం విడవడానికి భర్త తన భార్యకు నీటిని అందిస్తాడు.


Also read :  TTD November Festivals: నవంబర్ మాసంలో తిరమలేశుడి సన్నిధిలో జరిగే వేడుకలు ఇవే 


Karwa Chauth recipes, food items: కర్వాచౌత్ వంటకాలు
అత్తగారు తన కోడలికి ఒక సర్గి తాలిని ఆప్యాయతకు చిహ్నంగా, కుటుంబ వారసత్వ సంప్రదాయంగా ఇస్తారని కూడా నమ్ముతారు. సర్గి తాలిలో కొత్త బట్టలు, ఆభరణాలు, ఆహారాలు, పండ్లు, తీపి వంటకాలు, సోలా ష్రింగార్ (16 రకాల అలంకరణ వస్తుసామాగ్రి)  కలిగి ఉంటాయి. పెళ్లయిన మహిళకు కావలసిన ప్రతిదీ ఈ థాలిలో ఉంటుంది. 


Atla tadde - Karva Chauth: అట్ల తద్ది - కర్వా చౌత్:
ఇదే పండుగను తెలుగు వారు అట్ల తద్దిగా జరుపుకుంటారు. పౌర్ణమి తర్వాత మూడో రోజున తథియ నాడు తెలుగు వారు అట్ల తద్దెను జరుపుకుంటారు. ఈ ఏడాది అట్ల తద్ది నవంబర్ 3న జరిగింది.


Also read : Dussehra 2020: శమీ పూజ.. పాలపిట్ట దర్శనం ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe