Rahu Ketu Gochar 2023 Effects: సాధారణంగా ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన గమనాన్ని మార్చుకుంటూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో రాహు-కేతులను నీడ గ్రహాలుగా పిలుస్తారు.ఈ రెండు ఫ్లానెట్స్ ఎప్పుడూ తిరోగమన దిశలో కదులుతూ ఉంటాయి. ఇవీ ఒక రాశి నుండి మరొక రాశిలోకి వెళ్లడానికి ఏడాదిన్నర పడుతుంది. ఎవరి జాతకంలో రాహు-కేతు అశుభ స్థానంలో ఉంటుందో వారు అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం అక్టోబర్ 30న రాహువు మేషరాశిలోకి, కేతువు తులరాశిలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహాలు చెడు ఫలితాలను కాదు శుభఫలితాలను కూడా ఇస్తాయి. కేతు సంచారం వల్ల కొన్ని రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేతు సంచారం ఈ రాశులకు వరం
ధనుస్సు రాశి
తులారాశిలో కేతువు సంచరించిన వెంటనే ధనుస్సు రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. అంతేకాకుండా వీరి కెరీర్ మునుపటి కంటే అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులు ఈ సమయం బాగుంటుంది. 
వృషభం
వృషభ రాశి వారికి కేతువు సంచారం శుభప్రదంగా ఉంటుంది. వీరు మానసిక ఒత్తిడి, బాధల నుంచి బయటపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీరు శుభవార్త వింటారు. ధనలాభం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. 


మకరరాశి
కేతువు సంచారం వల్ల మకర రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. బాగా సంపాదించడంతో మీరు ఆర్థికంగా మెరుగుపడతారు. ఉద్యోగస్తులు ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు.
సింహరాశి 
అక్టోబర్‌లో కేతువు సంచరించిన వెంటనే సింహ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభపడతారు. కుటుంబ సభ్యులుతో సంబంధాలు మెరుగవుతాయి.


Also Read: Rajyog: అరుదైన యోగం చేయబోతున్న శనిదేవుడు... వీరు ధనవంతులవ్వడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook